కాంగ్రెస్ ప్రభుత్వంపై కెటిఆర్ సెటైర్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో..పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా..అంటూ ‘ఎక్స్’ వేదికగా మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామా రావు ఎద్దేవా చేశారు. 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి అని విమర్శలు గుప్పించారు. మళ్లీ ఒక బహిరంగ లేఖ రాస్తాడా ముఖ్యమంత్రి..అని విమర్శించారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే పక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా మంగళవారం నుంచి పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సచివాలయంలో సోమవారం ఆయన ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే రైతుబంధు పంపిణీపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై కెటిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.





