పాలిటిక్స్ అంతటా ఒకటే ట్రిక్స్
పగ్గాల కోసమే సాగుతోన్న రేస్
స్వలాభానికే అన్నిటా ఫస్ట్ ప్లేస్
ప్రజాహితం అన్న మాటే మైనస్
మార్పు కోసం ఉన్నది చాయిస్
తీర్పరుల నిర్ణయమే దీనికి ప్లస్
అవినీతి నేతలకి ఉండొద్దు బేస్
గట్టిగా వినిపించాలి ఈ వాయిస్
– వి.రమేష్ బాబు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్ర నాయకుడు నరేంద్ర మోదీ 3 వ రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.మహబూబా బాద్, కరీంనగర్ బహిరంగసభల్లో తో పాటు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఇతర ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విజయ భేరీ యాత్ర లో భాగంగా భువనగిరి, గద్వాల్, కొడంగల్ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు షాద్ నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. రైతు బంధు నిధుల విడుదలను నిలిపివేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.