వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ విధులు నిర్వహించే కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు , మైక్రో అబ్జర్వ్ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ అధికారులు అందరూ సమన్వయంతో సమిష్టిగా పని చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో సూపర్వైజర్ల పాత్ర చాలా కీలకమని పారదర్శకంగా కౌంటింగ్ విధులు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉదయం 5 గంటల వరకే గుర్తింపు కార్డుతో సహా కౌంటింగ్ హాల్లో ఉండాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ తో పాటు కౌంటింగ్ పరిశీలకులు స్నేహ హిందూ రావు పాటిల్, సాధన పరిశీలకులు పి.ఆకాష్, రిటర్నింగ్ అధికారులు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, శ్రీనివాసరావు విజయ కుమారి లతో పాటు జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి, డిఎస్హెచ్ఓ చక్రపాణి, డివైఎస్ఓ హనుమంతరావు, డిటిడిఓ కోటాజి, పరిశ్రమ శాఖ అధికారి వినయ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్ తదితరులు ఉన్నారు.
కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
