కొరోనా పేషెంట్స్‌కు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే

  • పలు హాస్పిటళ్లకు వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ
  • ఫిర్యాదులపై చర్యలకు దిగిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 25 : కొరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌నుంచి చిన్న హాస్పిటళ్లు కూడా తమ దగ్గరకు చికిత్స కోసం వొచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశాయని ఆరోపణలు అనేకం వినిపించాయి. అయితే తాజాగా హైదరాబాద్‌ ‌పరిసరాల్లోని హాస్పిటళ్లు అధిక ఛార్జీలు వసూలు చేశారనే ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మొత్తం 44 ఆసుపత్రులకు పేషంట్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏకంగా రూ.1.61 కోట్ల మొత్తం రోగుల కుటుంబాలకు తిరిగి ఇచ్చారు.

ఇందులో భాగంగా ఏకంగా జూన్‌ 22, 2021 ‌నాటికి రోగుల కుటుంబాలకు రూ. 1,61,22,484 తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నాలుగు ఆసుపత్రులు ఒక్కొక్కటి రూ. 10 లక్షలకు పైగా తిరిగి ఇవ్వగా.. కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి రోగి కుటుంబ సభ్యులకు మొత్తం రూ. 27.41 లక్షలు తిరిగి ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది.

నగరంలోని కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, ‌సచివాలయం, హైటెక్‌ ‌సిటీ, బషీర్‌బాగ్‌, ‌గచ్చిబౌలి, నాగోల్‌ ఇలా అనేక ప్రాంతాల్లోని అనేక హాస్పిటళ్లు తాము కరోనా సమయంలో వసూలు చేసిన డబ్బులను రోగి కుటుంబాలకు తిరిగి ఇచ్చాయి. నగరంలోని పలు ఆసుపత్రులు ఎక్కువ మొత్తాన్ని వాపసు చేసినప్పటికీ.. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినట్లు గుర్తించిన అనంతరం రోగులకు డబ్బును తిరిగి ఇచ్చే ఆసుపత్రుల జాబితాలో మొత్తం 44 ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నట్లు ఆర్టీఐ వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page