కొనసాగుతున్న వోటరుతో ఆధార్‌ ‌నమోదు పక్రియ

  • చురుకుగా బోగస్‌ ‌వోట్ల ఏరివేత
  • రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమం

వోటర్‌ను ఆధార్‌తో నమోదు చేయించే పక్రియ జరుగు తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఫోన్‌లకు ఆధార్‌ ‌నమోదు కోసం మెసేజ్‌లు వొస్తున్నాయి. దీంతో వోటరు కార్డుతో ఆధార్‌ ‌నమోదు ద్వారా బోగస్‌ ‌వోట్లను అరికట్టా లని అధికారులు నిర్ణయిం చారు. ఒక వ్యక్తి ఒకే వోటు హక్కు ఉండాలనేది ఎన్నికల కమిషన్‌ ‌నిబంధన మేరకు ఆధార్‌ ‌నమోదు కు చర్యలు తీసుకుంటున్నారు. వోటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫొటో సిమిలర్‌ ఎం‌ట్రీస్‌ ‌సాప్ట్‌వేర్‌ ‌ద్వారా డబుల్‌ ‌వోట్లు కలిగిన వారిని గుర్తించి జాబితాను రూపొం దిస్తున్నారు. జాబితా సిద్ధం కాగానే జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చి వాటిని తొలగిస్తారు. ఇలా ప్రతి జిల్లాలో చర్యలు చేపట్టారు. హైదరా బాద్‌ ‌నగరంతో సహా అనేక ప్రాంతాల్లో వోట్ల నమోదు, ఆధార్‌ అనుసంధాన పక్రియ కొనసాగుతుంది. చాలామంది నివాసాలు మారడంతో రెండు, అంతకు మించి చోట్ల వోటు హక్కు ఉంటుంది.

కొంతమంది పిల్లల చదువు, ఉద్యోగరిత్యా పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. సొంత గ్రామాల్లో వోటు హక్కుతో పాటు నివాసం ఉంటున్నచోట సైతం వీరు వోటు హక్కు విని యోగంచుకుంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపాల్టీ ఎన్నికల్లో సైతం వోటు హక్కు వినియోగిం చుకుం టున్నారు. ఇలాంటి వాటిని నివారించ డానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఫొటో సిమిలర్‌ ఎం‌ట్రీస్‌ ‌సాప్ట్‌వేర్‌తో ఇటువంటి వాటికి చెక్‌ ‌పెట్టే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రెండు చోట్ల ఒకే ముఖ కవళికలు ఉంటే కొత్తగా వొచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో అధికారులు వీరిని గుర్తిస్తున్నారు. ఇలా రెండుచోట్ల వోటు హక్కు ఉన్న వారందరినీ గ్రామాలు, వార్డుల వారీగా గుర్తించనున్నారు.

ఇలా రెండేసి వోటరు జాబితాలో ఉన్న వారిని ఒక చోట వోటు హక్కు తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా వోటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి అవకాశం లేకుండా అధికారులు పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. వోటరు కార్డు ఉన్న వారు ఫారం-6లో పూర్తి వివరాలు నింపి సంబంధిత బీఎల్‌వోలకు అందజేస్తే క్రోడీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. నమోదు చేసిన వెంటనే వోటరు ఫోన్‌కు మెసేజ్‌ ‌వస్తుంది. వీటితో పాటు డబుల్‌ ‌వోటరు కార్డులున్న వారికి ఇప్పటికే సమాచారం అందించి తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *