- చరిత్రను మార్చేస్తున్న అధికార పార్టీ
- నీతి ఆయోగ్ సమావేశం,పార్లమెట్ ప్రారంభోత్సవాలు అర్థం లేనివి
- బీహార్ సిఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా,మే27 : ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రారంభించనున్న సందర్భంగా బీహార్ సిఎం నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ప్రారంభో త్సవాన్ని దాదాపు19 పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రపతి చేత కాకుండా ప్రధాని ఎందుకు ప్రారంభిస్తున్నారని ఇప్పటికే విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అసలు కొత్త పార్లమెంట్‌భవనం అవసరం ఎందుకని బీహార్ సీఎం నితీశ్ కుమార్( ప్రశ్నించారు. పాత పార్లమెంట్ బిల్డింగ్ చరిత్రాత్మకమైందని,అయితే అధికారంలో ఉన్న వ్యక్తులు చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీలోజరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి కానీ, రేపు జరనున్న పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరుకావడంలో ఎటువంటి మతిలేని చర్య అని నితీశ్ అన్నారు. దేశ చరిత్రను అధికారంలో ఉన్న పెద్దలు మార్చేస్తున్నారంటూ పదేపదే నేను చెబుతూనే ఉన్నాను. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు దేశ చరిత్రలో ఒక భాగం.
ఈ ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనం నిర్మించాలని తహతహలాడింది. దేశ చరిత్రను మార్చాలనే ఉద్దేశమే ఇందుకు కారణం‘ అని నితీష్ అన్నారు. శనివారంనాటి నీతి ఆయోగ్ సమావేశానికి కానీ, ఆదివారం కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి కానీ హాజరుకావడం అర్ధం లేదని నితీష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులదుగా కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించాలన్న డిమాండ్‌తో 28వ తేదీ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు జేడీయూ ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవ్థలో రాష్ట్రపతికి కీలక పాత్ర ఉందని, ద్రౌపది ముర్ము అత్యున్నత రాజ్యాంగ పదవిని నిర్వహిస్తున్నారని, ఆయన మోదీ ఆహ్వానించి, ఆమె చేతుల దుగా పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేషఅ సింగ్ కుష్వాహ ఇటీవల అన్నారు. అయితే నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ప్రధాని స్వయంగా తానే పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించబోతు న్నారంటూ విమర్శలు గుప్పించారు.




