మల్యాల, మే 04(ప్రజాతంత్ర విలేకరి) : జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని మంత్రి తన్నీరు హరీష్ రావు బుధవారం దర్శించుకున్నారు. కొండగట్టు ఆలయానికి విచ్చేసిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మల్యాల మండలంలో పలు అభివృద్ధి పనులను సందర్శించాల్సి ఉండగా వాతావరణం సహకరించకపోవడంతో పర్యటన ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో తమ కార్యక్రమాలను అందుకు అనుగుణంగా మార్చుకున్నారు. వారు నూక పల్లి సరస్వతి దేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రతిపాదించిన నూకపల్లి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఓల్డ్ ఏజ్ హోమ్‌కు మంత్రి హరీష్ రావు సానుకూటంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఇంకా, ఎంపీపీ విమల, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మిట్టపెల్లి సుదర్శన్ , జెడ్‌పిటిసి రామ్ మోహన్ రావు, ముత్యం పేట సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామలింగ రెడ్డి, జనగం శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రవి, ఎమ్మార్వో సుజాత మరియు ప్రజా ప్రతినిధులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, టిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.