కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని ఓటర్లను అభ్యర్థించిన బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్,  ప్రజాతంత్ర  ,  నవంబర్ 14 : ఉప్పల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే, కెసిఆర్  మూడవసారి ముఖ్యమంత్రిగా గెలిపించి  హ్యాట్రిక్ సాధించాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.  మంగళవారం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో   బిఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి  ఏ.ఎస్.రావు నగర్ డివిజన్  నార్త్ కమలానగర్ , ఏపీఎస్ క్వార్టర్స్, భవాని నగర్ కాలనీలలో  బిఆర్ఎస్  సైన్యంతో కలిసి  ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేసి ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా  డివిజన్ ప్రజలు , మహిళా సోదరీమణులు మంగళ హారతులతో బండారి లక్ష్మారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని,  ప్రవేశపెట్టిన మేనిఫెస్టో , మహిళా సాధికారత గురించి ప్రజలకు స్పష్టంగా వివరిస్తూ, కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు చెప్పే అమలు కానీ హామీలను నమ్మి మోసపోయి గోసపడద్దంటూ, తెలంగాణకు కెసిఆర్ శ్రీరామరక్ష అంటూ, ఉప్పల్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరగాలంటే, కెసిఆర్మూడవసారిముఖ్యమంత్రిగా  కావాలన్నారు. ప్రతీఒక్కరు ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావని రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ కాసం మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page