Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ ‌కుటుంబాన్ని వొదిలిపెట్టే ప్రసక్తే లేదు

కెసిఆర్‌ ‌పాత కేసులన్నీ తిరగదోడుతాం
రాష్ట్రాన్ని దోచుకుంటూ అప్పుల పాల్జేశారు
ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

నిర్మల్‌, ‌ప్రజాతంత్ర,డిసెంబర్‌1: ‌కేసీఆర్‌ ‌కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. లిక్కర్‌, ‌డ్రగ్స్, ‌పత్తాల దందా చేసేటోళ్ల అంతు చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగూళురు డ్రగ్స్ ‌స్కాం కేసును మూయించింది కేసీఆరేనన్న బండి సంజయ్‌… ఆ ‌కేసును మళ్లీ తిరగదోడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ‌పై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందేనని పట్టుబట్టారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ రాష్టాన్న్రి కేసీఆర్‌ అప్పు‌ల పాల్జేస్తున్నారని ఆరోపించారు. ట్విట్టర్‌ ‌టిల్లు…. మిషన్‌ ‌భగీరథ నీళ్లేవి? అని నిలదీశారు.డబుల్‌ ‌బెడ్రూం, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, దళిత బంధు హాలేమైనయ్‌ అని బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. రోడ్లు, నీళ్లు, కనీస సౌకర్యాల్లేక రాష్ట్రం అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. హాలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌ ‌ను గ్రామగ్రామాన నిలదీయండని చెప్పారు. గ్రామాల అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివేనని తెలిపారు.

ఒక్క ఓలా గ్రామానికే రూ.3.89 కోట్లకు పైగా కేంద్రం నిధులిచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గ్రామాలకు వస్తున్న నిధులన్నీ కేంద్రం నుంచి వస్తున్నవే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పేదలకు ఇండ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, సీసీ రోడ్లు కేంద్రమే వేయిస్తుందని చెప్పారు. కానీ కేసీఆర్‌ ‌మాత్రం తాను అభివృద్ధి చేస్తున్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్‌ ‌జిల్లా ఓలా గ్రామంలో బండి సంజయ్‌ ‌రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్టాన్ని్ర కేసీఆర్‌ ‌నాశనం చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. కేసీఆర్‌ ‌పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బ్జడెట్‌లో ఉన్న రాష్టాన్న్రి అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. కేసీఆర్‌ ‌రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తిపై రూ. లక్ష అప్పు ఉందన్నారు. ప్రధాని మోడీని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం తప్ప కేసీఆర్‌ ‌రాష్టాన్రికి చేసిందే లేదన్నారు. తాగునీరు, ఇండ్లు, రోడ్లు ఏ హాని కేసీఆర్‌ ‌నెరవేర్చలేదన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కేసీఆర్‌ ‌దగ్గర పైసలు లేవు కానీ… స్థలాలు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కేసీఆర్‌కు పైసలు ఉన్నాయని ఆరోపించారు. ఢిల్లీలో లిక్కర్‌ ‌స్కాంలో కేసీఆర్‌ ‌బిడ్డ కవిత పైసలు పెట్టిందని బండి సంజయ్‌ ఆరోపించారు. అందుకే ఆమెపై ఈడీ కేసు పెట్టిందని చెప్పారు. కేసీఆర్‌ ‌కుటుంబం దొంగ దందాలు చేస్తుందని మండిపడ్డారు. రాష్టాన్రికి ఏ చేయని కేసీఆర్‌ ‌దేశాన్ని ఉద్దరిస్తడట అని ఎద్దేవా చేశారు.

Leave a Reply