కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్టీ రిజర్వేషన్ల జీవో ఇవ్వాలి

  • దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలదే
  • కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్టీ రిజర్వేషన్‌ ‌పెంపు జీవో తీసుకు రావాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ ‌చేశారు. హుజురాబాద్‌ ఓటమి తరువాతనే సీఎం కేసీఆర్‌కు ధాన్యం గుర్తుకొచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలులో ఏపీకి లేని ఇబ్బంది తెలంగాణకే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేసినా ఏమీ ఇవ్వలేదని విమర్వించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. బీజేపీకి చెడ్డ పేరు తీసుకు రావడానికే కేసీఆర్‌ ‌దేశమంతా తిరుగుతున్నారు తప్ప, రైతులపై ప్రేమతో కాదని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రబుత్వం బాయిల్డ్ ‌రైస్‌ ‌కోసం మిల్లర్లతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. రిజర్వేషన్‌ ‌విషయంలో రాజ్యాంగ విరుద్ధంగా తీర్మానం చేసి పంపించారనీ, మిజోరాం, మణిపూర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లు ఇస్తున్నాయనీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవాళ సాయంత్రమే రిజర్వేషన్ల పెంపు జీవో ఇస్తే అడ్డుకోబోమని స్పష్టం చేశారు. మెడికల్‌ ‌కళాశాలల ఏర్పాటుకు సంబంధించి తగిన నిబంధనలు పాటించాలనీ, ఎంసిఐ అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రబుత్వం మెడికల్‌ ‌కళాశాలలకు సంబంధించిన ప్రపోజల్స్ ‌సరిగా పంపలేదనీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలనీ, లేనిపక్షంలో అవి వేరే రాష్ట్రాలకు తరలిపోతాయని ఈ సందర్భంగా కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *