కేంద్ర ప్రభుత్వానికి భదాద్రి ప్రజల ఉసురుతప్పదు

ఐదు పంచాయితీలు తెలంగాణలో విలీనం చేయకపోతే…
ఇందిరా పార్క్ ‌వేదికగా గర్జించిన సిపిఐ
రాష్ట్ర రాజధానికి చేరిన ఐదు పంచాయితీల పోరు

హైద్రాబాద్‌ , ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 06 : ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర విభజన నేపథ్యంలో భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న 5 గ్రామపంచాయతీలను ఒక్క కలం పోటుతో అర్ధరాత్రి ఆర్డినెన్స్ ‌తీసుకవచ్చి భద్రాచలం ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్‌ ‌పాష కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దక్షిణ అయోధ్య భదాద్రి  సమస్యపై బుధవారం నాడు ఇందిరా పార్క్ ‌హైదరాబాద్‌ ‌వద్ద నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ఇం‌దిరాపార్క్ ‌వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 పంచాయతీల ఉద్యమాన్ని అవసరమైతే దిల్లీ స్థాయిలో తీసుకెళ్తామని భద్రాచలం పట్టణ అభివృద్ధి కొరకు ఐదు పంచాయతీలు తెలంగాణలో విలీనం చేసేంతవరకు సిపిఐ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

భద్రాచలం పట్టణానికి కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తుందని భద్రాచలం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి పాండురంగాపురం నుండి సారపాక వరకు రైల్వే లైన్‌ ‌పొడిగించడం ఎందుకు జాప్యం చేస్తున్నారని విమర్శించారు. 5 గ్రామపంచాయతీలు తెలంగాణలో విలీనం అయినప్పుడు భద్రాచలానికి న్యాయం జరిగిందని అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం నియోజకవర్గంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి భద్రాచల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వర రావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, గుత్తుల సత్యనారాయణ, దొండపాటి రమేష్‌ ,‌సిపిఐ పట్టణ  కార్యదర్శి ఆకోజు.సునీల్‌ ‌కుమార్‌, ‌సిపిఐ నాయకులు సంశెట్టి పూర్ణచంద్రరావు,  సాయి కుమార్‌ ,‌నోముల  రామిరెడ్డి, మరెడ్డి గణేష్‌, ‌ప్రదీప్‌, ‌తిరుపతి రావు, శివ, రంజిత్‌, ‌రత్న కుమారి, నిర్మల, మున్నా లక్ష్మి కుమారి తదితులు ఉన్నారు.నోట్‌: ఈ ‌వార్తలు మెయిన్‌ ‌పేజీ కోసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page