Take a fresh look at your lifestyle.

కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలేవి..?

పెట్రో, వంట గ్యాస్‌ ‌ధరలతో నడ్డి విరిచారు

నిజామాబాద్‌కు అర్వింద్‌ ‌చేసిందేవి• లేదు

రాహుల్‌ ‌వరంగల్‌కు వొచ్చి చేసేదేవి• లేదు

ఎన్నికల ముందు తెలంగాణ టూరిస్ట్ ‌స్పాట్‌గా మారింది

కాంగ్రెస్‌, ‌బిజెపిలపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బిజెపిని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌వంటగ్యాస్‌ ‌ధరలు సామాన్యులకు అందకుండా పెంచేశాని ఆమె దుయ్యబట్టారు. పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారో రైతులకు సమాధానం చెప్పాలన్నారు. పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని అరవింద్‌ ‌దిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. నగరంలోని ఖిల్లా రామాలయాన్ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ టెంపుల్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఆమె వెంట టీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు బిగాల గణెళిష్‌ ‌గుప్తా, జీవన్‌ ‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..బీజేపీ ఎంపీ అరవింద్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిజామాబాద్‌ ‌ప్రజలకు ఎంపీ అర్వింద్‌ ‌చేసిందేవి• లేదన్నారు. పసుపు బోర్డు కోసం 2016లో పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశామన్నారు. రాందేవ్‌ ‌బాబాను తీసుకొచ్చి ప్లాంట్‌ ‌పెట్టాలని కోరామని చెప్పారు. అరవింద్‌ ‌తప్పుడు ప్రచారాలు చేసి ఎంపీ సీటు గెలిచారని కవిత ఆరోపించారు. మూడేళ్లలో అరవింద్‌ ఏం ‌చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హావి•ని కూడా ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ఉచిత మాటలతో అరవింద్‌ ‌టైమ్‌పాస్‌ ‌చేస్తున్నారని, మూడేళ్లలో ఆయన నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఒక్కో పసుపు రైతుకు రూ. 200 కూడా రావని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ వరంగల్‌లో చేసేది రైతు సంఘర్షణ సభ కాదని.. రాహుల్‌ ‌సంఘర్షణ సభ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాహుల్‌ ‌గాంధీ తెలంగాణ గురించి ఒక్కసారి కూడా పార్లమెంటులో మాట్లాడలేదని..ఇప్పుడు వరంగల్‌ ‌వొచ్చి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ఇప్పుడు తెలంగాణ టూరిస్ట్ ‌స్పాట్‌ అయిందని..ఎన్నికలు వొస్తున్నాయి కదా… ఎవరో వొస్తారు, ఏదో యాత్ర చేస్తారని అన్నారు. బీజేపీ అబద్దాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వొచ్చిందని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప తెలంగాణకు ఆ పార్టీ చేసింది ఏవి• లేదని ఆమె మండిపడ్డారు. ఇక్కడ 27 శాఖల్లో 80 వేల ఉద్యోగాలు ఇస్తున్నామని…. కేంద్రంలోని ఖాళీలను భర్తీ చేయించాలని సూచించారు. రాష్ట్రంలో, దేశంలో అభివృద్ధిని పోల్చి చూడాలని.. దేశంలో మధ్యతరగతి ప్రజల ఖర్చు 50 శాతం పెరిగిందని కవిత తెలిపారు. ఓయూ సభపై విపక్షాలది అనవసర రాద్దాంతమన్నారు. కేంద్ర బలగాలను చాలా చూసామన్నారు. రెచ్చగొట్టే తత్వం బీజేపీ నేతలదని..తమది శాంతి పంథా అని కవిత అన్నారు. తమ వి•ద దాడి చేస్తే ఉరుకుంటామా? అని ప్రశ్నించారు. వరి కొనుగోలుపై పార్లమెంటులో లేవనెత్తాలని.. తెలంగాణ రైతులను ఆదుకోవాలని తాము రాహుల్‌ ‌గాంధీని కోరినా స్పందించలేదన్నారు. ఇప్పుడు రాజకీయాలు చేయడానికి ఇక్కడకు వొస్తున్నారన్నారు.

Leave a Reply