ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం డ్రామాలు
అమిత్ షా సభకు జనం భారీగా తరలి రావాలి
ఏర్పాట్లను పరిశీలించిన కిషన్ రెడ్డి
కెసిఆర్ సమస్యలను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను వంచిస్తున్నారన్న కేంద్ర మంత్రి
కేసీఆర్‌కు అహంకారం పెరిగింది : ఎంఎల్‌ఏ ఈటల
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ సర్కార్‌కు సమాధి కట్టి.. ప్రజాస్వామ్య బద్ధమైన ప్రభుత్వాన్ని భాజపా ఏర్పాటు చేయనుందని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ కుటుంబ కబంధ హస్తాల్లో తెలంగాణ బందీ అయ్యిందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద రేపు జరగనున్న బహిరంగ సభకు భాజపా నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభకు హాజరు కానున్నందున.. భారీ ఎత్తున జన సవి•కరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నేతలు ఈటల రాజేందర్ సహా పలువురు నాయకులు తుక్కుగూడ వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కుటుంబ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్ర సర్కార్‌పై కేసీఆర్.. ఎన్నో తప్పుడు ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. వాటన్నింటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్నంతా తామే కొనుగోలు చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్.. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు. భాజపాపై కేసీఆర్, కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ తప్పుడు ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాం. రాష్ట్రంలోని ధాన్యమంతా కొనుగోలు చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ .
ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. రాష్ట్రంలో అవినీతి, నిరంకుశ సర్కార్‌కు సమాధి కడతాం అని కిషన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ధాన్యం సేకరణ నుంచి అనేక సమస్యల పరిష్కారంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనను అంతం చేసేందుకు బండి సంజయ్ పాదయాత్ర అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హావి•లను అమలు చేయటం లేదని విమర్శించారు. ప్రతి నియోజకరవర్గంలో సభలు నిర్వహిస్తామన్నారు. ఈ సభకు ప్రజలకు తనవంతు సహకారం అందించేందుకు అమిత్ షా ముఖ్య అతిథిగా వొస్తున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హావి•లను అమలు చేయకుండా.. ప్రధానమంత్రిని సైతం ఇష్టం వొచ్చినట్లుగా తిడుతున్నారన్నారు. కేసీఆర్‌కు అహంకారం పెరిగిందని… టీఆర్‌ఎస్ సర్కార్ పై ప్రజలు కన్నెర్ర చేస్తున్నారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్లో పలచబడిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని మరిచి రాజ్యం మాదిరిగా కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలతో కేసీఆర్ పాలనా సాగుతుందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలన అంతం చేయటానికే బండి సంజయ్ పాదయాత్ర అని చెప్పుకొచ్చారు. పాదయాత్ర ముగింపు సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా వొస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హావి•లను అమలు చేయకుండా ఎలా మాటలు చెప్తున్నారని ప్రశ్నించారు. ప్రజలను చైతన్యవంతం చేస్తూ.. కేసీఆర్‌ను గ్దదె దింపడమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టారన్నారు. అమిత్ షా హాజరయ్యే బహిరంగ సభ విజయవం కోసం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.