అధికారంలోకి రాగానే పేదలకు కర్నాటక తరహా పథకాలు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
రైతులకు బేడీలు వేసి బుకాయింపులా? : ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వొస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే కర్ణాటకలో మాదిరి హావి•లన్నీ కాంగ్రెస్ అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణలో కూడా మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తామన్నారు. తమ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టాలని చూస్తున్నారని..అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మరన్నారు. ఆదిలాబాద్‌లో 8 అసెంబ్లీ స్థానాలు వి•రు గెలిపించండి.. రాష్ట్రంలో 80 అసెంబ్లీ స్థానాలు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియమ్మకు జన్మదిన కానుక ఇద్దాం అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రేవంత్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా గురువారం రేవంత్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నను జోకుడు రామన్న అంటే బాగుంటదని విమర్శలు గుప్పించారు. జోగు రామన్న చెల్లని రూపాయని కేసీఆర్ నిర్ణయించారని..అందుకే జోగు రామన్నకి మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు.
ఆదిలాబాద్‌కు బీఆర్ఎస్ చేసిందేవి• లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణశాఖ మంత్రి ఉన్నా అక్కడి ప్రజలకు ఇల్లు రాలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తామని హావి• ఇచ్చారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని ఆయన స్పష్టం చేశారు. షాద్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మాయమాటలు నమ్మి షాద్‌నగర్ ప్రజలు రెండుసార్లు మోసపోయారన్నారు. కర్ణాటకలో బీజేపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని.. నిత్యం ప్రజల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రైతులకు బేడీలు వేసి బుకాయింపులా? : ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ నాయకులను కలవడానికి వెళ్తే బేడీలు వేస్తారా అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి రైతులకు బేడీలు వేయడంపై ఆయన మండిపడ్డారు. గురువారం వి•డియాతో మాట్లాడుతూ… రైతుల చేతులకు బేడీలు వేసి వాళ్ళు రైతులే కాదని బుకాయిస్తారా అని నిలదీశారు. తెలంగాణలో రైతులకున్న కష్టాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. అప్పట్లో ఖమ్మం రైతులకు బేడీలు వేశారని.. ఇప్పుడు భువనగిరి రైతులకు బేడీలు వేశారన్నారు. రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసేవాళ్ళు దేశంలో రైతు రాజ్యం తెస్తారా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉంటాయా అంటూ నిలదీశారు. రైతుల భూములు కబ్జా చేసేవాళ్ళని అందలం ఎక్కిస్తూ ప్రశ్నించిన రైతులకు బేడీలా అంటూ మండిపడ్డారు. ధరణి పేరిట బీఆర్ఎస్ నేతలు భూముల కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కొందరు కలెక్టర్లు ధరణి పేరుపై పేదల భూముల్లో స్కాం చేస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జూలై 2న రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ జరుగుతుందన్నారు. యువతి యువకులు, విద్యార్థులు జూన్1 వరకు క్విజ్ కాంపిటీషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని మహేష్ కుమార్ పేర్కొన్నారు.




ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే