కెసిఆర్‌ ‌కుటుంబ పాలనపై పోరాటం

  • తెలంగాణలో బిజెపి సునామి
  • నిలువరించడం ఎవరితరం కాదన్న రాష్ట్ర బిజెపి ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌

‌ప్రజాతంత్ర, వికారాబాద్‌, ‌మార్చి 21 : కేసీఆర్‌ ‌మంత్రివర్గంలో 420లు ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ‌ఛార్జి తరుణ్‌ ‌చుగ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ సునావి• రావడం ఖాయం అన్నారు. దీనిని ఆపే వాళ్లు ఎవరూ లేరు. కేసీఆర్‌ ఆశలు గాలిలో మేడల్లా కూలిపోవడం ఖాయం అంటూ  కేసీఆర్‌ ‌పాలనపై నిప్పులు చెరిగారు. వికారాబాద్‌ ‌జిల్లా బీజేపీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క హావి•ని కూడా కేసీఆర్‌ అమలు చేయలేదని, కేసీఆర్‌ ‌కుటుంబానికి మాత్రం అన్నీ దక్కాయన్నారు. తెలంగాణ కోసం అనేక మంది యువకులు బలిదానం చేసుకున్నారు .. కానీ లబ్దిమాత్రం కల్వకుంట్ల కుటుంబానికే దక్కిందన్నారు. బీజేపీ కార్యకర్తలు సమిష్టిగా పోరాడి కేసీఆర్‌ను గద్దె దించాలి. అవినీతి కుటుంబ పాలనను ఓడించి అంతా కలిసి ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడాలన్నారు తరుణ్‌ ‌చుగ్‌. ‌కేసీఆర్‌ ‌విశ్వాస ఘాతుకం నుండి ప్రజలను కాపాడాలన్నారు. ప్రజాస్వామ్యయుతంగా కుటుంబ అవినీతి పాలనను అంతమొందించేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. ప్రతి ఒక్కరు గల్లీ గల్లీ, వార్డ్ ‌వరకు , శక్తి కేంద్రం వరకు వెళ్లి అందరినీ సంఘటితం చేయాలి. బీజేపీ ఎలా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందో చెప్పాలి. ప్రజలకు న్యాయం చేసేందుకు బీజేపీ అతి పెద్ద ఆందోళన చేపట్టబోతోంది. అందరికీ న్యాయం జరిగేలా చేస్తాం.

తెలంగాణ ప్రజల్ని కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌మోసం చేసింది. తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయని కేసీఆర్‌ ‌చెప్పారు. లాఠీ దెబ్బలు యువకులు తింటే .. లబ్దిమాత్రం అమరికా నుండి వచ్చిన కేటీఆర్‌ ‌కు దక్కింది. తెలంగాణ ఉద్యమంతో కనీసం సంబంధం లేని పదిమంది తెలంగాణలో అధికారం చెలాయిస్తున్నారు. కేసీఆర్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌లో ప్రజాస్వామ్యం లేకుండా చేసాడు. సర్కార్‌ ‌లో ఉన్నాం కాబట్టి టీఆర్‌ఎస్‌ ‌లో ఉన్నాం అంటున్నారు టీఆర్‌ఎస్‌ ‌నేతలు. పార్టీలో కనీసం స్వేచ్చగా గాలి పీల్చే పరిస్థితి లేదంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్‌ ‌చుగ్‌. ‌

తెలంగాణ అభివృద్ది కోసం కాదు.. రాష్ట్రంను దోచుకునేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలు పార్టీని విడిచి పెట్టాలని చూస్తున్నారు. ఏ గ్రామంలో సామాన్యుడిని అడిగినా ఇది దొంగ ప్రభుత్వం .. ప్రజల కలల పట్ల విశ్వాస ఘాతుకం చేసాడు అని చెబుతారు. తెలంగాణలో రైతులు, యువకులు, మహిళలు, దళితులు నారాజ్‌ ‌లో ఉన్నారు.. ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. మంత్రులపై ముఖ్యమంత్రి కిచెన్‌ ‌క్యాబినెట్‌ ‌పెత్తనం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కాకుండా మరింత మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కుటుంబంలో ఒక్కో విభాగానికి ఒక్కో ముఖ్యమంత్రి ఉన్నారు.. వారంతా దోచుకునేందుకు ఆలోచనలు చేస్తుంటారని తరుణ్‌ ‌చుగ్‌ ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *