కెసిఆర్‌ను గద్దె దించడమే కాంగ్రెస్‌ ‌లక్ష్యం

  • రాష్ట్రాన్ని దోచుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీ
  • 14 నెలల తర్వాత అధికారంలోకి కాంగ్రెస్‌
  • ‌పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి
సుబేదారి(హన్మకొండ), ఏప్రిల్‌ 21(‌ప్రజాతంత్ర విలేఖరి) : రాష్ట్రానికి పట్టిన చీడ, పీడ, గతి కెసిఆర్‌ అని, అతనిని గద్దె దించడమే కాంగ్రెస్‌ ‌పార్టీ లక్ష్యమని పిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం హన్మకొండలోని ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రేవంత్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కి, సీతక్క, అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌వరంగల్‌ ‌హనుమకొండ పిసిసి అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, కొండ మురళి, జనగామ పిసిసి అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ ‌పార్టీ అని, అయితే తెలంగాణ తెచ్చింది..ఇచ్చింది నేనేనని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ, కెసిఆర్‌, ‌కేటీఆర్‌ ‌చెప్పే మాటలు నూటికి నూరుపాళ్లు అబద్ధమని, తెలంగాణను అన్ని రకాలుగా దోచుకుంటున్న కెసిఆర్‌ను గద్దె దించడమే కాంగ్రెస్‌ ‌పార్టీ లక్ష్యమని, కెసిఆర్‌కు 14 నెలలు టైం ఉందని ఈ 14 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తుందని ఆయన అన్నారు.
బుధవారం హనుమకొండ హయగ్రీవాచారి గ్రౌండ్లో సరిగిన సభలో కేటీఆర్‌ ‌మాట్లాడిన మాటలకు రేవంత్‌ ‌రెడ్డి స్పందిస్తూ అరే కేటీఆర్‌ ‌నువ్వు ఎక్కడ ఉన్నావు..తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీలో 45 నిమిషాల సేపు మాట్లాడి అసెంబ్లీ నుండి సస్పెండ్‌ అయిన వ్యక్తిని తానని, తనతో పాటుగా మరో ముగ్గురు అసెంబ్లీ నుండి సస్పెండ్‌ అయ్యారని, తెలంగాణ కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తిని తానేనని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోనికి తీసుకుని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, 1400 మంది ఆత్మబలిదానాలు చేసిన తెలంగాణ పునాదులపై కెసిఆర్‌ ‌కుర్చీ వేసుకొని కూర్చొని తెలంగాణ తాను తెచ్చానని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌ ఎక్కడ ఉన్నావు, తెలంగాణ లేకపోతే పిసిసి ఎక్కడిదని మొరిగిన కేటీఆర్‌ ‌నీకు తెలవకపోతే నీ అయ్యని అడిగి తెలుసుకో, నీ అయ్యకు బండిలో పెట్రోల్‌ ‌లేకపోతే నేనే పోయించనానని, మీ అమ్మను అడుగు కానీ చిల్లరగా మాట్లాడి ప్రజల దృష్టిని మళ్లిద్దామని ప్రయత్నం చేయకు..అని కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల గుండెల్లో ఉందని, కాంగ్రెస్‌ ‌స్థాయి నుండి కాంగ్రెస్‌ ‌వోటు బ్యాంకు ఉందని, ప్రస్తుతం కెసిఆర్‌ ‌ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని, పోలీసులు, ఇతర అధికారులు సభకు వొచ్చే ప్రజలను గాని, ఫ్లెక్సీలను గాని ఎలాంటి హాని జరుపకుండా చూడాలని, లేదంటే కాంగ్రెస్‌ ‌పార్టీ ఏర్పడిన తర్వాత ఎవరెవరు ఏ ఆటంకాలు కల్పించింది వడ్డీతో సహా తీరుస్తానని రేవంత్‌ ‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్‌ ‌పార్టీపై చిల్లర, చిల్లర మాటలు మాట్లాడుతున్నా కేటీఆర్‌ ఇకనుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, నిన్ను గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆగడాలు రోజురోజుకు పెరిగి పోతున్నాయని, టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు అందినకాడికి దోచుకుని తింటున్నారని, ఇది అందరి అండదండలతోనే జరుగుతుందని, రానున్న రోజులలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ భూస్థాపితం అవుతుందని అన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ..
రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతుందని ఎవరికి తోచిన విధంగా వారు పరిపాలన చేపడుతున్నారని ఆమె అన్నారు. నాయిని రాజేందర్రెడ్డి మాటా్ల డుతూ..నిన్న బహిరంగ సభలో కేటీఆర్‌ ‌మాట్లాడిన మాటలు ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడిన మాటలు కాదని, బజారు రౌడీగా మాట్లాడిన మాటలని ఆయన ఎద్దేవా చేశారు. మధుయాష్కి మాట్లాడుతూ..కేటీఆర్‌ ‌తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడిని తెలంగాణ వొచ్చిన తర్వాత బువ్వ వండి వార్చిన తర్వాత పల్లెంలో పెట్టుకొని తినడానికి తయారు అయిన వ్యక్తి కేటీఆర్‌ అని,  కాంగ్రెస్‌ ‌పార్టీ గురించి, కాంగ్రెస్‌ ‌పార్టీ వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది కాంగ్రెస్‌ ‌పార్టీ అని, నువ్వు, నీ అయ్యా తెలంగాణ ప్రజలను మోసం చేసిన మొదటి వ్యక్తులని, ఇక మీ పాలన కొనసాగదని ఆయన అన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో జంగా రాఘవరెడ్డితో పాటు కాంగ్రెస్‌ ‌నాయకులు కొండా మురళి, మాజీఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page