మన యుద్ధ్దం ఇక కెసిఆర్‌తోనే
వచ్చే ఎన్నికల్లో పోటీ టిఆర్‌ఎస్‌తోనే
తెలంగాణ ఆకాంక్షలను కాలరాసిన కెసిఆర్
కాంగ్రెస్ కుటుంబ సమస్యలను అంతర్గతంగానే చర్చించాలి
పత్రికలకు ఎక్కితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు
క్షేత్రస్థాయిలో ప్రజలతో కలసి పనిచేసే వారికే పార్టీ టిక్కెట్లు
గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయకర్తలతో రాహుల్ స్పష్టీకరణ
హైదరాబాద్,ప్రజాతంత్ర, మే7: మన యుద్దం కెసిఆర్..టిఆర్‌ఎస్‌తోనే అని కాంగ్రెస్ అగ్రనే రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. జనలబలం లేని కెసిఆర్‌కు ధనబలం, అదికార బలం ఉన్నా లాభం లేదని గుర్తించాల న్నారు. అలాగే విభేదాలు పక్కన పెట్టి కలసికట్టుగా యుద్దానికి సన్నద్దం కావాలన్నారు. కాంగ్రెస్‌లో విభేదాలపై అగ్రనేత రాహుల్ దృష్టి సారించారు. పార్టీలో విభేదాలుంటే నాలుగు గోడల మధ్యే చర్చించు కోవాలే తప్ప పత్రికలు ఎక్కకూడదన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయకర్తలతో రాహుల్ భేటి అయ్యారు. టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశానికి రాహుల్, రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుకాచౌదరి, గీతారెడ్డి తదితరుల సహా 300 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందన్నారు. ఎంత సీనియ్లంల్గ• ఎంత రాజకీయ చరిత్ర ఉన్నవారికైనా ఇది వర్తిస్తుందన్నారు. క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ తీసుకొని టికెట్లు ఇస్తామన్నారు. కుటుంబంలోని వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమన్న రాహుల్… తాను ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, ఆలోచనలు వింటానని తెలిపారు. ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుందాం కానీ.. డియా ముందు మాత్రం చెప్పొద్దని వెల్లడించారు. నేతలందరి కృషి వల్ల వరంగల్ సభ దిగ్విజయం అయ్యిందన్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్‌పై గౌరవమున్న కార్యకర్తలు కోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కెసిఆర్‌తో నే తమ యుద్దమని కూడా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమ పోరు టిఆర్‌ఎస్‌తోనే అని అన్నారు. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని రాహుల్ గాంధీ మరోమారు మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు కానీ, జనబలం లేదని విమర్శించారు. ప్రజల కంటే మించిన శక్తి ఇంకొకటి ఏదీ ఉండదన్నారు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య భీకర పోరాటం ఉండబోతుందని తెలిపారు. హైదరాబాద్‌లో కూర్చుంటే టికెట్లు రావని, ప్రజలతో ఉండి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు.
కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల సంసిద్ధతపై రాహుల్ దిశా నిర్దేశం చేశారు. వరగంల్ డిక్లరేషన్ తెలంగాణలోని ప్రతి రైతుకు చేరాలన్నారు. ఆ తర్వాత నన్ను ఎవరూ తప్పు పట్టొద్దు. టికెట్ వస్తుందన్న భ్రమలో ఎవరూ ఉండొద్దు. మన ముందు రెండు మూడు లక్ష్యాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజల కలల్ని నిజం చేయడం మన లక్ష్యం. ఈ లక్ష్యాలు సాధించాలంటే మన పార్టీలో ఐకమత్యం అవసరం. వరంగల్ డిక్లరేషన్ రైతులకు కాంగ్రెస్‌కు మధ్య నమ్మకం కలిగించాలన్నారు. దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అది అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. వచ్చే నెల రోజుల్లో ఈ పని పూర్తి చేయాలి. డియా మందు ఏది పడితే అది మట్లాడొద్దు. ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడండి. డియాకు ఎక్కితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తెలంగాణను ఒక ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ మధ్యే యుద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఏర్పాటు చేసేది నిరంకుశ ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. మెరిట్ ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని తెలిపారు. ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేసేవారికే టికెట్ ఇస్తామని చెప్పారు.సీనియర్లు అయినా సరే పార్టీ కోసం పనిచేయకుంటే టికెట్ రాదు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి గురించి సర్వే చేసి టికెట్లు కేటాయిస్తాం. వరంగల్ డిక్లరేషన్ గురించి ప్రతి వ్యక్తికి, ప్రతి రైతుకు తెలియజేయండి. వరంగల్ డిక్లరేషన్ గురించి చిన్నపిల్లలకు కూడా తెలియాలి. వరంగల్‌లో చెప్పింది డిక్లరేషన్ మాత్రమే కాదు.. ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య ఒప్పందం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8 ఏళ్లుగా అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోంది. విద్యం, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం జరగలేదు. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తెరాసకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో యువత కదిలిరావాలి. ఎన్నో ఆశయాలతో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఇన్నేళ్లలో ప్రజలు, సోనియాగాంధీ అనుకున్నది రాష్ట్రంలో జరగలేదు. అందరి ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లో కూర్చుంటే… దిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావని కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.
తనకు హైదరాబాద్ బిర్యానీ, ఛాయ్ ఎంత బాగుంటుందో తెలుసని చెప్పిన రాహుల్… టికెట్ దక్కాలంటే హైదరాబాద్‌ను వదిలి గ్రామాల్లోకి వెళ్లాలని సూచించారు. వెనుక డోర్ నుంచి టికెట్ తెచ్చుకుంటామనుకునే వాళ్లు ఆశలు వదులుకోవాలని వివరించారు. ప్రజల కంటే మించిన శక్తి ఇంకొకటి ఏదీ ఉండదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య భీకర పోరాటం ఉండ బోతుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా మరోసారి.. పార్టీలో పనిచేసే వారికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందని, ఎంత సీనిర్లకైనా ఎంత రాజకీయ చరిత్ర ఉన్నవారికైనా ఇది వర్తిస్తుందని రాహుల్ కాంగ్రెస్ నేతలకు తెలిపారు. టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశానికి రాహుల్, రేవంత్, భట్టి, కోమటిరెడ్డి, ఉత్తమ్ సహా 300 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఆయన సచివాలయం ఎదురుగా నిర్మిస్తున్న అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. రేవంత్ తదితరులు వెంట ఉన్నారు.