Take a fresh look at your lifestyle.

కూల్‌రూఫ్‌ ‌పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ‌ఛార్జీలు

  • భవనాలకు మంచి ప్రయోజనాలు
  • అనుసరించేవారికి ప్రోత్సాహకాలు…ప్రజల్లో విస్తృతంతగా ప్రచారం చేయాలి
  • 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో భవనాలకు కూల్‌ ‌రూఫ్‌ ‌తప్పనిసరి
  • కూల్‌రూఫ్‌ ‌పాలసీ విడుదల సందర్భంగా మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ ‌రూఫ్‌ ‌పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది భవిష్యత్‌ ‌తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. ఇంటితోపాటు, గోడలను కూల్‌రూఫ్‌ ఉం‌చుకుంటే విద్యుత్‌ ‌వినియోగం కూడా తగ్గుతుందన్నారు. మొదట తమ ఇంటిపై కూల్‌ ‌రూఫ్‌ ‌విధానం అమలుచేశామన్నారు. హైదరాబాద్‌ ‌మాసబ్‌ట్యాంక్‌ ‌సీడీఎంఏ ఆఫీస్‌లో కూల్‌రూఫ్‌ ‌విధానంపై ఆయన మాట్లాడారు. భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్‌రూఫ్‌ ‌పాలసీ 2023-28ని మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశం మొత్తంలోనే హైదరాబాద్‌లో ఆఫీస్‌ ‌స్పేస్‌కు డిమాండ్‌ ఉం‌దని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు దేశంలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. టీఎస్‌ ‌బీపాస్‌తో దేశంలో ఎక్కడాలేని విధంగా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని వెల్లడించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు.

ఈ ఏడాది హైదరాబాద్‌లో 5 చదరపు కిలోవి•టర్ల కూల్‌ ‌రూఫ్‌ అమలుచేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. డబుల్‌ ‌బెడ్‌రూమ్‌ ఇం‌డ్లన్నిటిపై కూల్‌ ‌రూఫ్‌ అమలు చేస్తామన్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోవి•టర్ల కూల్‌ ‌రూఫ్‌ ‌టాప్‌ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్‌ ‌రూఫ్‌ ఏర్పాటును తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. కూల్‌రూఫ్‌ ‌వల్ల వి•టరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. కూల్‌రూఫ్‌ ‌పెయింట్‌ ‌వేయడం వల్ల కరెంటు చార్జీలు ఆదా అవుతాయని చెప్పారు. ఇప్పటికే కట్టిన భవనాలపై కూడా కూల్‌రూఫ్‌ ‌విధానం అమలుచేయొచ్చని వెల్లడించారు. ఈ పాలసీలో భాగంగా రాష్ట్రంలో కూల్‌రూఫ్‌ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని, అనుసరించేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. పాలసీలు, చట్టం చేయడం చాలా సులువని, కానీ వాటిని అమలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు.

విద్యుత్‌ ‌వాహనాల వినియోగం పెరగాలనేది సీఎం కేసీఆర్‌ ఆశయమని తెలిపారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్‌కు హైదరాబాద్‌లో రెండు ప్లాంట్‌లు ఏర్పాటుచేశామని మంత్రి కేటీఆర్‌ ఆన్నారు. నాలుగు వోట్లు వస్తాయని కూల్‌ ‌రూఫ్‌ ‌పాలసీ విధానం తేవడం లేదని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. దేశంలో అత్యధిక ఆఫీస్‌ ‌స్పెస్‌ ‌హైదరాబాద్‌లోనే ఉందని..మన హైదరాబాద్‌ ‌స్టోరీ ఇప్పుడే మొదలైందని, టీఎస్‌ ‌బి పాస్‌ ‌విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ ‌రూఫ్‌ ‌పాలసీ తెస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. 2030 నాటికి హైదరాబాద్‌లో 200 చదరపు కిలోవి•టర్లు, మిగతా ఏరియాలో 100 చదరపు కిలోవి•టర్లు కూల్‌ ‌రూఫింగ్‌ ‌చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. ప్రభుత్వం ఆదాయం కోసం ఈ పాలసీ తేవడం లేదన్నారు. త్వరలో మననగరం కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. బిల్డింగ్‌ ‌నిర్మాణ వ్యర్థాల రీయూజ్‌ ‌చేయడానికి బిల్డర్లు సహకరించాలని కోరుతున్నానన్నారు. రాజకీయాల కోసం పాలసీ తేవడం లేదని.. భవిష్యత్‌ ‌తరం కోసం రూఫ్‌ ‌పాలసీ తెస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply