‘‘కింది స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కోట్ల రూపాయల్లో అవినీతి కుంభకోణాలు జరుగుతున్నయన్న ఆరోపణలు తరచుగా విన వస్తూనే ఉన్నాయి.ప్రభుత్వం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు వీరి సమ్మేళనమే ప్రభుత్వం అయినప్పడు ప్రభుత్వంలోని కొందరి చేతుల్లో ఆర్థిక వ్యవస్థలో నిధులను స్వప్రయోజనాలకే ప్రక్క తోవపట్టిస్తు ఎక్కువ మొత్తంలో అవినీతి పాల్పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనలు కొనసాగుతూనే ఉండటం శోచనీయం.’’
- వివిధ రంగాల్లో అతిగా విస్తరిస్తున్న అవినీతి ..
- కోట్ల రూపాయల కుంభకోణాల ఆరోపణలు…
- కింద నుంచి పై స్థాయి వరకు అక్రమాలేనా..
చాలా సందర్భాల్లో దేశాన్ని పాలించిన ప్రభుత్వాల్లో సైతం వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరగాయన్న ఆరోపణలు వినవచ్చాయి.దర్యాప్తు సంస్థలు వివరాలతో దర్యాప్తు ముందుకు కొనసాగించిన ఎక్కువ శాతం కుంభకోణాల ఆరోపణలు పూర్తిగా సమాదానం లేని ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయా అని పిస్తోంది అని అనుకునే వారు లేకపోలేదు .ప్రతిపక్షాలు పాలకులు ఒకరికొకరు అవినీతి కుంభకోణ ఆరోపణలు చేసుకో వడం దేశ ప్రజల యొక్క దృష్టిని తమవైపు మళ్లించు కోవడానికి పెద్ద ఎత్తున వీటిపై స్పందించే తీరు స్వార్థ రాజకీయాల కొరకేనా అని గుసగుసలు ఆడుకునేవారు లేకపోలేదు.
దేశంలో ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో గత ప్రభుత్వాలలో జరిగిన అవకతవకలను అధికార పక్షం ,ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలను ప్రత్యారోపణలు చేసుకోవడం సర్వసాధనమైపోయింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హయాంలో జరిగిన భోఫర్స్ ఆర్మీకి చెందిన తుపాకుల కొనుగోలు విషయాల్లో వేల కోట్ల రూపాయల కుంభకోణంలో అవకతవక జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాఫెల్ యుద్ధమానాలకు సంబంధించి విలువైన సమాచారం దాచి వేల కోట్ల రూపాయలు అనుకూలమైన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని అనుమానాలు ఆరోపణలు వచ్చాయి. దేశంలో బయటకు వచ్చిన కుంభకోణాలలో ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల కుంభకోణాలలో స్టాక్ మార్కెట్ కుంభకోణం టూజి స్పెక్ట్రామ్ కుంభకోణం తెల్గీ డూప్లికేట్ స్టాంప్ ఫోర్జరీ కేసుకు సంబంధించిన కుంభకోణం, హవాల కుంభకోణం కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన కోట్ల రూపాయల దుర్వినియోగం లాంటి కుంభకోణంలో అధికారులు సహకారం అందించడం వల్లనే ఇలాంటి సంఘటనల చోటుచేసుకుంటున్నయా అనే వాదనలు తరచూ బలంగా వినిపిస్తున్నాయి.
ఆర్థికపరమైన కుంభకోణాల్లో కోట్ల రూపాయలను అక్రమ మార్గంలో సంపాదించి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో కార్పొరేట్ సంస్థల లోని పలుకుబడిన కొందరు ఆర్ధిక లావాదేవీలలో మోసానికి పాల్పడడం కుంభకోణాల్లో తరచుగా వినిపిస్తున్న మాటలైన ప్రతి అవినీతి ఆరోపణల కుంభకోణాల్లో ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల ప్రమేయాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రజల దృష్టిని ఆకర్షించే రీతిలో కుంభకోణాలు చర్చ అంశంగా మారుతున్నాయి. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ధనం వ్యవస్థలకు శాఖలకు కేటాయించబడ్డప్పుడు ఆయా సంస్థల నుండి పథకాల అమలులో ప్రజల సంక్షేమం కోసం బదిలీ అయ్యే క్రమంలో కొంతమంది మోసపూరిత ధోరినిలో గుప్పిట్లోకి ఆర్థిక లావాదేవీలను తెచ్చుకునే విధంగా చేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది చేస్తున్న అవినీతి అక్రమాలు తారస్థాయి చేరుకోవడం సర్వసాధనమైపోతున్నాయి పని జరగాలంటే ఫైల్ కదిలాలంటే లంచాల పేరిట ముడుపుల చేయాల్సిన పరిస్థితులు ఆయా కార్యాలయాల్లో సంభవిస్తుండటం విచారకరం.తరచుగా ఇలాంటి విషయాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సంపాదించి విధిగా బాధ్యతతో విధులు నిర్వహించవలసిన ఉద్యోగులు కొందరు లంచాలకు మరిగి లంచం ఇస్తేనే పనిచేస్తారనే రీతిలో కార్యాలయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి చూస్తే అవతమవుతుంది.అన్ని రంగాల్లో విస్తృతంగా లంచగొండితనం పేరుకుపోతున్నది.ప్రభుత్వ టెండర్లలో సైతం తమ అనుకూలం వారికే టెండర్లు.కైవసం చేసుకునే పరిస్థి తులు ఉన్నాయి.ప్రజల యొక్క సొమ్ము ప్రభుత్వాలు అనుసరించవలసిన విధానాలతో ప్రజలకు అందిస్తున్న సేవల్లో కొంతమంది అధికారులు ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టే విధంగా అవినీతి కుంభకోణాల్లో తమ ప్రత్యేకత పాత్రను చాటుకుంటున్నారని లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారుల వార్త సమూ హారాలను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందేమో.
– దాడిశెట్టి శ్యామ్ కుమార్
బీసీజే, వరంగల్ జిల్లా,9492097974.