Take a fresh look at your lifestyle.

కాళీమాతను పోలి ఉండేలా అసభ్య చిత్రాలు

ట్విట్టర్‌ ‌నుంచి తొలగించి క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్‌

న్యూ దిల్లీ, మే 2 : కాళీ మాత చిత్రాన్ని పోలి ఉండేలా ట్విట్టర్‌లో పోస్టులు చేసిన ఉక్రెయిన్‌ ‌రక్షణ శాఖ.. తాజాగా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాలో హాలీవుడ్‌ ‌నటి మార్లిన్‌ ‌మన్రోను గుర్తుకు తెచ్చేలా ’వర్క్ ఆఫ్‌ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో ఏప్రిల్‌ 30‌న ఓ చిత్రాన్ని షేర్‌ ‌చేసింది. ఈ ఫొటోలో పైకి లేస్తున్న స్కర్ట్‌తో ఉన్న స్త్రీ ఉంది. కానీ ఈ స్త్రీ డ్రెస్సింగ్‌ అం‌తా కూడా హిందూ దేవత మహంకాళీ అవతారాన్ని పోలి ఉంది. దీంతో ఇండియన్‌ ‌నెటిజన్లు సోషల్‌ ‌డియాలో తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ ‌జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్‌ ‌చేశారు. ఉక్రెయిన్‌ ‌క్షమాపణ చెప్పాలని కోరారు.

ఈ విమర్శల నేపథ్యంలో పోస్టు చేసిన ఇమేజ్‌ ‌ను ఉక్రెయిన్‌ ‌రక్షణ శాఖ తమ ట్విట్టర్‌ ‌ఖాతా నుంచి డిలీట్‌ ‌చేసింది. తాజాగా ఉక్రెయిన్‌ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఎమినే జెపర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా ఇండియాకు క్షమాపణలు చెప్పారు. కాళీదేవిని తప్పుగా చూపేలా ట్వీట్‌ ‌చేసినందుకు రిగ్రేట్‌ ‌గా ఫీలవుతున్నట్టు తెలిపారు. భారతీయ సంప్రదాయాలను ఉక్రెయిన్‌ ఎప్పు‌డూ గౌరవిస్తుందని, మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply