ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : ఎన్నికలలో గెలుపోటములు సహజమని ఎంతమంది పోటీ చేసిన గెలిచేది ఒక్కరేనని బిజెపి పార్టీ కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కల్వకుర్తి బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. బుధవారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో న్యాయవాది జగన్, కల్వకుర్తి నియోజక వర్గానికి చెందిన కార్యకర్తలతో కలిసి కేంద్ర మంత్రులను ఎంపీలను కలిశారు. ఈ సందర్భంగా ఆచారి కి వారు ధైర్యం చెప్పారు. ఆరుసార్లు ఓడిపోయిన మూడుసార్లు రెండవ స్థానంలో నిలిచి అత్యధికంగా వోట్లు రావడం పట్ల వారు కల్వకుర్తి ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఆచారికి సూచించినట్లు తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నియోజకవర్గం లో జరిగిన హోరాహోరీ పోరులో ధన బలం పని చేసిందన్నారు. ప్రజలు 70,448 వోట్లు వేసి బిజెపిని ఆదరించారని ఆచారి కేంద్రమంత్రులకు వివరించినట్లు తెలిసింది.
కార్యకర్తలు అధైర్య పడొద్దు అండగా ఉంటా
