పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: శ్రావణమాసంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడంతో అమ్మవారి కృప నియోజవర్గ ప్రజలపై ఉంటుందని ఎంఎన్ఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.జిన్నారం మండలం కాజీపల్లి శ్రీ పెద్దమ్మ దేవాలయంలో శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు నీలం మధు ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్సవ నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్ కు జన సంద్రం మధ్య ఘన స్వాగతం పలికారు. పెద్దమ్మ తల్లి అందరిని సుఖ సంతోషాలతో ఉండాలని మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలని కోరినట్లు చెప్పారు. పెద్దమ్మ కృప వల్ల ఈసారి ఎన్నికల్లో తాను ప్రజల తరపున పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామ గ్రామాన పార్టీలకతీతంగా మద్దతు లభిస్తుందని ఆయన అన్నారు.అందరూ ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చూపిస్తానని, ఒక్కసారి అవకాశం కల్పించాలని ఆయన కోరారు.అనంతరం అభిమానులు గజమాలతో నీలం మధు ముదిరాజును ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్ల సత్యనారాయణ, ఉప సర్పంచ్ ఆంజనేయులు యాదవ్,వార్డు సభ్యులు చిరుమని సురేష్, పరివేద స్వప్న శ్రీనివాస్, పరివేద రాజు, గండి నరసింహ యాదవ్, నాయకులు శ్రీనివాస్,చంద్రయ్య,మహేష్,లక్ ష్మణ్,జితెందర్,శ్రీకాంత్, శ్యామ్,వినోద్,రజినీకాంత్, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.