ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 21 : 60 ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసేది ఏమిలేదని బీఆర్‌ఎస్ చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు.మంగళవారం చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి, ధర్మసాగర్,ఖానాపూర్, దేవరంపల్లి,రేఘడిగణాపూర్,నాంచే రు,ఇంద్రారెడ్డినగర్, కిష్టాపూర్,ఇబ్రహీంపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఇంటింటికీ తిరుగుతూ బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార వాహనంపై ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ..కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని,సీఎం కేసీఆర్ పాలనలో పదేండ్లలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందని అన్నారు.కాంగ్రెస్కు ఓటు వేస్తే చీకట్లు తప్పవని,వారి ఆరు గ్యారంటీలు ఉత్త బూటకమన్నారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని అమలు చేసిందని,చేవెళ్లలో నిలబడ్డ అభ్యర్థుల చరిత్ర ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.వారిపై ఉన్న కేసులు ఏమైనా అవార్డులా,లేక రివార్డులా అని ఎద్దేవా చేశారు.మరింత అభివృద్ధికి మరోసారి అవకాశమివ్వాలని సేవకుడిగా సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ పులిమామిడి నారాయణ, ఐదు గ్రామాల సర్పంచ్‌లు శ్రీలతప్రభాకర్‌రెడ్డి,నరహరిరె డ్డి,నర్సింలు,సక్కుబాయి,మంజుల, జడ్పీటీసీ మాలతి,వైస్ ఎంపీపీ శివ ప్రసాద్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి,వైస్ చైర్మన్ నర్సింలు, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్,ఎంపీటీసీ వాసవి,మాజీ ఎంపీపీ బాల్‌రాజ్,బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రమణారెడ్డి,కృష్ణారెడ్డి,బీఆర్ ఎస్ మండల బీసీసెల్ అధ్యక్షుడు ఎదిరె రాములు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శివనీల చింటు,సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి,ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి,రైతు బంధు సమితి కౌకుంట్ల అధ్యక్షుడు నాగార్జు రెడ్డి,మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ ఘని,బీఆర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షుడు శేఖర్,బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్,గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫయాస్,బీఆర్‌ఎస్ నాయకులు మద్దెల జంగయ్య,శేరి రాజు,సాయినాథ్,నర్సింలు,దండు సత్యం,బీఆర్‌ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.