తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత సంపత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు గురువారం హైదరాబాదులోని గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు ఆమెతోపాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు గురువారం డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో చలో గాంధీ భవన్ చేపట్టిన కార్యక్రమం లో భాగంగా భారీగా నియోజకవర్గంలోని యాలాల పెద్దేముల్ బషీరాబాద్ తాండూరు నుంచి నేతలు, నాయకులు సుమారు 4 నుండి 500 వాహనాలలో భారీగా తరలివెళ్లి గాంధీభవన్ లో టీపీసీపీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు. తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్, డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి కుమారుడు మహిపాల్ రెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, యువజన నాయకులు కావలి సంతోష్ కలాల్ చంద్రశేఖర్ సయ్యద్ షుకూర్ అయా మండల పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.