- కాంగ్రెస్‌కు టిఆర్‌ఎస్ బి టీమ్..రెండు పార్టీలూ ఒకటే
- పికె వ్యవహారాలు తెలంగాణలో పనిచేయవు
- బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 25 : ప్రధాని మోదీని మూడోసారి అధికారంలోకి రానివ్వకూడదని ప్రశాంత్ కిషోర్ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందులో భాగంగానే బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకొస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్ బి టీమ్ అని, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలవి చీకటి ఒప్పందం ఉందని, ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసునని, ఎన్ని పార్టీలు ఏకమైనా ప్రధాని మోదీని ఏవి• చేయలేరని ఆయన అన్నారు. మూడో సారి కూడా దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్ సోమవారం వి•డియాతో మాట్లాడుతూ.. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నించారని, పీకేతో భేటీ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు.
పీకే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్‌తో కేసీఆర్ పనిచేయబోతున్నారని, పీకే, కేసీఆర్ వ్యూహాలు తెలంగాణలో పనిచేయవని, వారిని తెలంగాణ ప్రజలు నమ్మరని లక్ష్మణ్ అన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు గతంలో పొత్తులు పెట్టుకున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని, టీఆర్‌ఎస్‌కు ఎవరు ప్రత్యర్థి అనే విషయం ప్రజలకు తేలియదా.. అంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ప్రజల్లో వొస్తున్న ఆదరణ చూసి కేటీఆర్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని, అవి రెండూ ఒకటేనని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఒకటే కాబట్టి ఆ రెండు పార్టీలకు పీకే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారని పేర్కొన్నారు. మొన్నటి దాకా కాంగ్రెసేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్… పీకే రాకతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ కలిసి పని చేసేలా పీకే వ్యూహాలు పన్నుతున్నారన్నారు. అందులో భాగంగానే టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ దోస్తీ కట్టనుందన్నారు.
కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారులు కేఏ పాల్, ఎంఐఎం అని మంత్రి కేటీఆర్ అంటున్న తీరు చూస్తుంటే…కేటీఆర్ రాజకీయ తెలివి ఏపాటిదో అర్ధమవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వొస్తున్న ఆదరణను చూసి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఎవరెన్ని వ్యూహాలు రచించినా ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతున్నాయన్నారు. బీజేపీనీ వ్యతిరేకించే పార్టీలను ఏకం చేయటానికి పీకే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్‌కు ఏర్పాటు ఏమైందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ కోసం కేసీఆర్ పనిచేయబోతున్నారన్నారు. మంత్రి కేటీఆర్ పెద్ద అజ్ఞాని అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్‌కు ఎవరు ప్రత్యర్థి అనే విషయం ప్రజలకు తెలుసన్నారు.