మెదక్ ఎంపి టికెట్ ఆఫర్?
నేడో, రేపో సిఎం రేవంత్‌రెడ్డితో జయరామ్‌రెడ్డి భేటీ
చక్రం తిప్పుతున్న ప్రభుత్వ సలహాదారుడు?
సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 17: పార్లమెంటు ఎన్నికల వేళ..అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఎలాగైనా అత్యధిక పార్లమెంటు స్థానాలను హస్తగతం చేసుకోవడానికిగానూ సిఎం రేవంత్‌రెడ్డి టిపిసిసి హోదాలో తనద్కెనశ్కెలిలో పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం లోని మందపల్లికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఐలేని జయరామ్‌రెడ్డి(ఎక్స్‌ప్లోజివ్)
ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన జయరామ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతితో ఉండటంతో కూడా ఆయనను క్రియాశీలకంగా ఉండటానికి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడంతో పాటు త్వరలో జరగనున్న మెదక్ ఎంపి టికెట్ ఆఫర్‌ను కూడా ఇచ్చారని సమాచారం. ఈ మేరకు సిఎం రేవంత్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ప్రభుత్వ సలహాదారుడు జయరామ్‌రెడ్డితో సంప్రదింపులు జరపడమే కాకుండా, ఒకట్రెండు రోజుల్లో సిఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త కావడంతో పాటు ‘రెడ్డి’సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ బరిలో దింపితే ఈ స్థానాన్ని గెలుచుకోవడం చాలా ఈజీ అని భావించిన సదరు ప్రభుత్వ సలహాదారుడు జయరామ్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జయరామ్‌రెడ్డి కూ జయరామ్‌రెడ్డి కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.




