- ఇడి తలచుకుంటే గంటలోపే అరెస్ట్ చేయొచ్చు
- పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 11 : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో అంతా డ్రామా నడుస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్, బిజెపిలు డ్రామాను ఆడుతున్నాయని మండిపడ్డారు. నిజానికి ఈడీ తలుచుకుంటే ఎమ్మెల్సీ కవితను గంటలోపే అరెస్ట్ చేయొచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. కవితను జైల్లో వేయడానికి ఇంత సేపా అని వ్యాఖ్యానించారు. ఇందంతా బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీ సందర్శన అనంతరం రేవంత్ వి•డియాతో మాట్లాడారు.
కవిత అరెస్ట్ అయితే కేసీఆర్ వీధుల్లోకి వొచ్చి ఆందోళన చేస్తారని..బీఆర్‌ఎస్ ఆందోళనతో బీజేపీ కూడా రోడ్డెక్కుతుందన్నారు. ఇదంతా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ అని విమర్శించారు. ఇకపోతే పసుపు రైతులను బీజేపీ ఎంపీ అర్వింద్ మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్ ఇచ్చిన హావి• అమలు చేయలేదన్నారు. చెరుకు ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయకుంటే ఫ్యాక్టరీ గేటుకు ఉరేసుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట తప్పారని ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేసిన బీఆర్‌ఏస్, బీజేపీలను వొచ్చే ఎన్నికల్లో భూ స్థాపితం చేయాలన్నారు.