సంక్షేమ పథకాల అమలుకు ప్రజల వద్దకు పాలన.
తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అభయస్తం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చి ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ప్రసాద్ కుమార్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. గత పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క పేదోడికి కూడా వైట్ రేషన్ కార్డులు జారీ చేయలేదని తెలిపారు. అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు అందించి సంక్షేమ పథకాలను అందేలా చర్యలు తీసుకుంటామని ప్రసాద్ కుమార్ తెలిపారు. ప్రజలు ఆతృతకు ఆందోళనకు గురికాకుండా సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఎంపీపీ వసంత వెంకట్ మోమిన్ పెట్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





