Take a fresh look at your lifestyle.

కనుమరుగై పోతున్న ఉత్తరం

నేడు పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఉత్తరం అందుబాటులో ఉన్నా దాని వినియోగం తగ్గింది. ఈ మధ్యకాలంలో ఉత్తరాలు చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాల్లోనే చూస్తున్నాము గతంలో మంచి కబురైనా విషాదకరమైన ఘటన అయినా ఉత్తరాల ద్వారా సమాచారం ఇచ్చే వాళ్ళము. పూర్వం లేఖలను కాగితంపై రాసి పావురాలతో పంపేవారు తదనంతరం పోస్ట్ ఆఫీస్‌ ఏర్పడి ఉత్తరాలను పోస్ట్ ‌మ్యాన్‌ ఆ ‌రోజులో కోడి కూతతో లేచి ఊరూరా తిరుగుతూ ఉత్తరాలు అందించేవారు. మనం పాత సినిమాలలో చూసినట్లు ఉత్తరంలో పైసలు ముఖ్యమైన కాగితాలు కూడా చేరవేసేవారు. సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులకు అనుగుణంగా టెలిగ్రాం, టెలిఫోన్‌ ‌తదనంతరం సెల్‌ ‌ఫోన్‌ ‌ప్రస్తుతం స్మార్ట్ ‌ఫోన్‌ ‌వచ్చాయి సెకన్‌ ‌లో యోగ క్షేమ సమాచారలు తెలుసుకుంటున్నాము. మనీ కూడా ఫోన్‌ ‌పే, జి పే ద్వారా ట్రాన్స్పర్‌ ‌చేసుకుంటున్నాము ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యమైనదే కానీ అదే పనిగా స్మార్ట్ ‌ఫోన్‌ ‌లు వాడుతూ పోతే పొల్యూషన్‌ ‌కూడా అధికము అవుతుంది. నేడు అందరికి ఫోన్‌ ‌లు అందుబాటులోకి వచ్చాయి దీంతో సిగ్నల్‌ ‌కోసం టవర్స్ ‌వాడకం ఎక్కువైంది దీని వల్ల పిచ్చుకలు మొదలయిన పశు పక్షాదులు రేడియేషన్‌ ‌వల్ల కనుమరుగై పోతున్నాయి తద్వారా పర్యావరణ సమతుల్యతలు ఏర్పడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఫోన్స్ ‌సాధ్యమైనంత వరకు పరిమితంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తూ ఉత్తరాల ద్వారా కూడా సమాచారాన్ని చేరవేస్తూ పూరతన పద్దతులను కాపాడుకుంద్దాం.
గతంలో ఉత్తరా ప్రత్యుత్తరాల కోసం ఎదురు చూసే వాళ్ళం. రాజుల కాలం నుండి స్వాతంత్య్ర సమరయోధులు వరకు ఉత్తరాల ద్వారానే సమాచారాలు చేరవేసే వారు. కాలంతో పాటు కార్డులకు కాలం చెల్లింది తపాలా శాఖ రూపు రేఖలు మారాయి కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక అప్పుడు ఉత్తరాలు పోస్టు కార్డులు, మనీ ఆర్డర్లు, మోసుకొచ్చిన తపాలా శాఖ ఇప్పుడు సరుకు రవాణా, ఈ-కామర్స్ ‌డెలివరీలు బ్యాంకింగ్‌, ‌కొరియర్‌, ‌బీమా పెన్షన్‌, ‌పాస్‌ ‌పోర్టు, ఆధార్‌, ‌టీటీడీ టిక్కెట్ల ,అత్యధిక శాతం డ్రైవింగ్‌ ‌లైసెన్సు, ఏటీఏం కార్డులు, బ్యాంకు చెక్‌ ‌బుక్స్, ‌స్టూడెంట్‌ ‌బుక్స్ ‌మందుల ప్రస్తుతం బిజినెస్‌ ‌మెయిల్స్, ‌పార్సిల్స్, ‌స్పీడ్‌ ‌రిజిస్టర్డ్ ‌మేయిలోస్‌ ‌పెరిగాయి బట్వాడా తదితర సేవలు అందిస్తుంది. ఆర్ధిక అవసరాలా రిత్యా ప్రస్తుతం వాణిజ్య వ్యాపార సేవలతో లాభాలు ఆర్జించే పనిలో పడింది తపాలా శాఖ.
160 ఏళ్ళు సేవలందించిన టెలీ గ్రాం ఐదేళ్ళ క్రితం కనుమరుగైంది. ఇంటర్నెట్‌, ‌సెల్‌ ‌ఫోన్‌ ‌లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు, పోస్టు కార్డులకు బ్రేక్‌ ‌పడింది. ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్లు మరిపించాగా మనీ ఆర్డర్లు డిజిటల్‌ ‌బ్యాంకింగ్‌ ‌మింగేసింది. ఆధునిక సాంకేతిక విప్లవంతో మనుగడ ప్రశ్నర్ధకమైంది తపాలా శాఖ కూడా ఆధునికతను ఉపయోగించుకుని వినూత్న ఆలోచనలతో సరికొత్త సేవలకు ముందడుగు వేసింది. పోస్టల్‌ ‌సిబ్బందిని సరుకు రవాణా, ఈ-కామర్స్ ‌డేలివరీలకు వినియోగించుకుంటుంది మరోవైపు బ్యాంకింగ్‌ ‌బాధ్యతలు చేపట్టింది. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పోస్టుకార్డు, ఆధార్‌ ‌నమోదు తదితర సేవలు అందిస్తుంది. ఉత్తరాలు, పోస్టుకార్డులు ఇన్‌ ‌లాండ్‌ ‌లెటర్లు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. తపాలా శాఖ సాంకేతికత విజ్ఞానంతో సాధారణ ఉత్తరాల బట్వాడాపై ద్రుష్టి సారించింది. పోస్టు బాక్సులు సకాలంలో క్లియరెన్స్ ‌చేసేందుకు స్మార్ట్ ‌ఫోన్‌ ‌తో స్కానింగ్‌ ‌నిర్వహిస్తోంది. కమ్యూనికేషన్లు పెద్దగా విస్తరించని కాలంలో ఉత్తరమే మనుషుల మధ్య వారధి. ఉత్తరాలే సమాచారాన్ని అందజేసే సాధనాలు. ఒక మనిషి క్షేమ సమాచారాల్ని, లోలోపలి ఉద్వేగాల్ని మరో మనిషికి అందజేసే వాహికలు.
1990 ల వరకు ‘నాకు ఏమైనా ఉత్తరాలు వచ్చాయా’ అని పెద్దలు, పిల్లలు ఇంటికి రాగానే అడిగేవారు. ‘వెళ్ళగానే కార్డుముక్క రాయి’ అని క్యాంపస్‌కు వెళ్ళే పిల్లలతో అమ్మ నాన్న చెప్పేవారు. ఇంటి చూరుకు ఉత్తరాల గుత్తి వేలాడుతుండేది లేదంటే గూట్లో పాత ఉత్తరాలు పోగుపడి ఉండేవి అంతగా ఉత్తరాలు రాసుకునే సంప్రదాయం తెలుగువారి జీవితంలో అంతర్భాగమై ఉండేది. గతంలో మనసైన మనిషికి ఉత్తరం రాసే వాళ్ళం వారి ఉత్తరంకోసం ఎదురుచూడటం చిత్రమైన అనుభూతి. సాహిత్య ప్రక్రియగా ఉత్తరం ప్రాశస్త్యం అనన్యమైంది. ఉత్తరాల రూపంలో వచ్చిన కథలు, నవలలు అనేకంగా ఉన్నాయి. ఇక ప్రత్యేకించి ప్రేమ ప్రేమగా, మనసులోని మమతనంతా రంగరించి రాసిన చలం ‘ప్రేమలేఖలు’ మార్కస్, ఎం‌గెల్స్ ‌మధ్య నడిచిన లేఖలు, ఇందిరకు తండ్రి నెహ్రూ రాసిన లేఖలు ఈ కోవకు చెందినవే. ఆనాటి అమెరికా అధ్యక్షుడు థామస్‌ ‌జఫర్సన్‌ ‌తన జీవితకాలంలో దాదాపు ఇరవై వేల ఉత్తరాలు రాశారు అంటే అతిశేయోక్తి కాదు వాటిలో వ్యక్తిగత, సామాజిక, వైజ్ఞానిక, చరిత్ర, ప్రేమ కోసం తండ్లాట ఇట్లాంటి వన్ని కలగలసి లోకంపై, మనుషులపై అతని ఆపేక్ష తెలియజేస్తాయి.
జాతి వివక్షకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ రాసిన లేఖలు మానవాళిపై ఆయన మహౌన్నత ప్రేమను వ్యక్తం చేస్తాయి, ప్రేమ్‌చంద్‌, ‌చార్లెస్‌ ‌ఫిలిప్‌ ‌బ్రౌన్‌ ‌తెలుగులో రాసిన లేఖలు అనేకం సేకరించారు ఆయన గాంధీజి స్వయంగా ఎన్నో ఉత్తరాలు రాశారు. శ్రీశ్రీ, ఆరుద్ర, గురజాడ, బోయి భీమన్న వంటి వారి ఉత్తరాల్లో తెలుగు సాహిత్యం ఉట్టి పడుతుంది. పూరతనం నుంచి ఈనాటి వరకు పరిపాలకులకు లేఖలు రాయడం ఆనవాయితీగా వస్తుంది అందుకే ప్రతి పక్ష ప్రతినిధులు ప్రజా, కుల, ఉద్యోగ సంఘాల నాయకుల  వరకు అధికార పక్ష నాయకులకు తమ డిమాండ్‌ ‌లను ఉత్తరాల ద్వారా పంపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఉన్నత అధికారులు తప్ప సామాన్యమైన మానవులు చాలా వరకు ఉత్తరాలు రాసే అలవాటును పూర్తిగా మర్చి పోయారు కావునా ఉత్తరాలను ప్రజలందరూ ఉపయోగించే విధంగా అవగాహన కల్పిస్తూ ఉత్తరాల పూర్వ వైభవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నాము.
image.png
మిద్దె సురేష్‌, 9701209355 

Leave a Reply