నా అక్షరం జనహిత కరదీపిక,
నా కవిత్వం ప్రజాస్వామ్యానికి దిక్సూచి,
నా గొంతు నియంతలనెదిరించే
నినదించు ధిక్కార స్వరం.
ఓయ్!
నీకు తెలుస్తోందా?
అహంకారాంధకారంలో
కొట్టుమిట్టాడుతూజి
నియంతల జాబితాలోకి
తెలియకనే చేరుతున్నావని,
నీ గోరీ నువ్వే తవ్వుకుంటున్నావని.
ఎక్కుపెట్టిన ప్రశ్నలను ఖైదు చేసే
నీ ఈ దారి సరికాదు.
ఎందుకొచ్చిన పిచ్చి పనులు?
నీవేమి చేసినా
మనోభావాల్ని ఆపలేవుగా!
ఓ పౌరుడా!
అన్యాయాక్రమాలతో,
మందిని ఇబ్బంది పాల్చేస్తున్నవారిని
ఎదుర్కోవడంలో
తుఫానుకు సిద్దమవుతోన్న
సముద్రంలా సంసిద్ధుడవై,
విక్రమార్కునిలా విరుచుకుపడు.
సమసమాజ స్థాపనలో
శాంతి సుమసౌరభాలను
వ్యాపింపచేసే యత్నంలో రాజీపడక
సాగిపో!! మునుముందుకు.
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం