Take a fresh look at your lifestyle.

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 28 : ఒక్క కాన్పులో ఓ మహిళకు నలుగురు పిల్లలు పుట్టారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్‌లోని పీపుల్స్ ‌హాస్పిటల్‌లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంబీరావుపేట మండలం సముద్రలింగాపూర్‌ ‌కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళకు రెండో కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు.

ప్రస్తుతం తల్లి, పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈ మహిళకు మొదటగా బాబు, తర్వాత పాప, బాబు, బాబు మొత్తం నలుగురు పిల్లలు పుట్టారని డాక్టర్లు తెలిపారు. మొదటి కాన్పులో ఒక బాబు జన్మించిన తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు రెండో కాన్పులో నలుగురు బిడ్డలు పుట్టడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యం  వ్యక్తం చేస్తున్నారు. పిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం తదుపరి చికిత్స కోసం కుటుంబసభ్యులు సిద్ధిపేట హాస్పిటల్‌కు తరలించారు.

Leave a Reply