ఏసుప్రభు చూపిన శాంతి మార్గం ఎంతో ఆచరణీయం.
రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్.
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ఏసుప్రభు కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం క్రిస్టమస్ పండగ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అరుణ్ కుమార్, దీపక్ నివాసం వద్ద నిర్వహించిన వేడుకల్లో ప్రసాద్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత రెడ్డి పాల్గొని వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ యేసుప్రభు ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన చూపిన శాంతి మార్గం ఎంతో ఆచరణీయమని ప్రతి ఒక్కరు శాంతి మార్గంలో నడుచుకొని చక్కటి జీవితం సాగించాలని పేర్కొన్నారు.