Take a fresh look at your lifestyle.

ఏపి విజయవాడలో అంధ యువతి అమానుష హత్య

విజయవాడ, ఫిబ్రవరి 13 : మరో అమానుషం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లి మనోహరం మాట్లాడుతూ…తన కుమార్తెను అన్యాయంగా చంపేశాడంటూ కన్నీటి పర్యంతమైంది. కళ్లు కనిపించవనే కనికరం కూడా చూపలేదని వాపోయింది.

గంజాయి ముఠా ఆగడాలు పెరిపోతున్నాయని, రాజు గంజాయి సేవించే వచ్చాడని, రాణి పట్ల తాను అసభ్యంగా ప్రవర్తించటం లేదని చెప్పి వెళ్లిపోయాడని తల్లి మనోహరం తెలిపింది. మళ్లీ అరగంటలో వెనక్కి వచ్చి గొడ్డలితో నరికి చంపాడని పేర్కొంది. తన కుమార్తె అబద్దాలు చెప్పదని…రాజు అసభ్యంగా ప్రవర్తించిన మాట వాస్తవమని చెప్పింది. తన కుమార్తెను అన్యాయంగా నరికేశాడని… గతంలో కూడా కొందరిపై కత్తితో దాడి చేశాడని ఆమె పేర్కొంది. గంజాయి ముఠా ఆగడాలతో స్థానికులు భయపడుతున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే ఇళ్ల దకు వెళ్లి అల్లరి చేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మనోహరం డిమాండ్‌ ‌చేసింది.

Leave a Reply