ఏది సత్యం – ఏది కల్పితం’’

ఎంతో మంది ఈ సృష్టిలో జన్మించారు. గతించారు. అందులో కొంతమంది మాత్రమే ప్రపంచం మెచ్చిన మహనీయులుగా తమదైన శైలిలో చెరగని ముద్రవేసి, చరిత్రలో తమకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుని, తమ ఆలోచనలను తరతరాలకు తరగని విలువైన వారసత్వ సంపదగా మిగిల్చి విశేషమైన ఖ్యాతి నార్జించారు.

అటువంటి కోవకు చెందిన మహాజ్ఞాని తత్వవేత్త, సత్వాన్వేషకుడు, తెలుగువారి జ్ఞాన గని జిడ్డు కృష్ణమూర్తి. నిజమైన మానవ సంబంధాలు,మానసిక విలువలు, మాన సిక పరివర్తన కోసం కృషి చేసి జగద్గురువుగా ప్రజలు భావించినా, ఈ భావజాలాన్ని దూరంగా నెట్టిన నిజమైన తాత్వికుడు,సత్యాన్వేషి జిడ్డు కృష్ణమూర్తి. పూలపాన్పులా సాగే జీవితాన్ని త్యజించి, వేలాది ఎకరాల భూమిని వద్దనుకుని వాస్తవిక ప్రపంచంలో నిరాడంబరంగా జీవించి, తత్వంలో ఆధునికత్వం జోడించిన జిడ్డు కృష్ణమూర్తి నిజమైన దార్శనికుడు. ఆయన బోధనలు నేటి అస్తవ్యస్త ప్రపంచ గమనాన్ని సరి చేయడానికి ఎంతో ఉపకరిస్తాయి.ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మవద్దని, నమ్మి మోసపోవద్దని, తమను తాము నమ్ముకోవడం కూడా దండగని, చంచలమైన ఆలోచనలను విడనాడాలని, ఉన్నతంగా ఎదగాలని ఉద్భోధించాడు.

ఉన్నతంగా ఎదగడమ ంటే కోట్ల సంపద కూడబెట్టడం కాదు. ఉన్నతమైన ఆలోచ నలతో, ఉత్తమంగా జీవించడమే. ఆకాశహార్మ్యాల్లో, పట్టు పరుపుల మీద జీవించడం వలన మానవ జన్మకు సార్ధకత చేకూరదు. ఎలాంటి ఆడంబరాలు, అట్టహాసాలు లేకుండా, మానసిక మాలిన్యం లేకుండా సాధారణ జీవితం గడపడం లోనే నిజమైన సంతృప్తి దాగి ఉంది.ఏకాంత జీవితం కృష్ణమూర్తి జీవన విధానం. సమాజంలోని కుళ్ళుకు, కుతంత్రాలకు దూరంగా స్వచ్ఛమైన మనసుతో, స్వేచ్ఛాజీవితం గడపాలని, నిత్య నూతన జ్ఞాన తేజస్సుతో విరాజిల్లాలని జిడ్డు కృష్ణమూర్తి తత్వం. తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా ప్రజల్లో మానసిక పరిణితి తీసుకురావడానికి ఆయన ఎంతో ప్రయత్ని ంచాడు. మన జీవితంలో ఇతరుల ప్రభావం పడకూడదని, ఎలాంటి సంఘర్షణకు తావు ఇవ్వరాదని, ఇతరుల వలన కలిగే చెడు ప్రభావానికి దూరంగా మెలగి, తనను తాను రక్షించుకోవాలని, మనలో మనమే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలని జ్ఞాన బోధ చేసిన కృష్ణమూర్తి ఆస్తికుడు కాదు,నాస్తికుడు కాదు.

అతనొక వాస్తవికవాది. స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఏకాంతంగా జీవించి, సమాజంలోని వ్యక్తుల విషప్రభావం తన మీద పడకుండా తన మాటల ద్వారా, రచనల ద్వారా మానవ ప్రపంచానికి వాస్తవాలను బోధించిన అరుదైన తత్వ వేత్త జిడ్డు కృష్ణమూర్తి.మూర?త్వం గర్వానికి పరాకాష్ట. ఆత్మాభిమానం మానవజన్మకు ఆభరణం.ఎవరి చెంతనో మన అభిమాన ధనాన్ని తాకట్టు పెట్టి, జీవించడంలో అర్ధం లేదు. నిష్కల్మష హృదయంతో జీవించాలి. ఇతరుల దుర్భోధలకు దూరంగా ఉండాలి. గాయాన్ని తాకకుంటే, దానంతట అదే మానిపోయినట్టు, గాయం లాంటి దుష్టసాంగత్యాన్ని విడనాడితే మానసిక శాంతి చేకూరుతుంది. మన మాటలు,చేష్టలు ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. ఎవరితో ఎంత వరకు ఉండాలో, అంతవరకే మన పరిధిని మనమే నిర్ధేశించుకోవాలి. మన ప్రశ్నకు మనమే సమాధానం అన్వేషించు కోవాలని,మృదు స్వభావంతో, సద్గుణాలతో జీవించాలని శాశ్వతం కాని జీవితం కోసం పరితపించి దుర్మార్గాలకు ఒడిగట్టడం అత్యంత హేయమని, ఈ ప్రపంచంలో కులాన్ని బట్టి,మతాన్ని బట్టి ఎవరూ అధికులు కాలేరని, జ్ఞానాధికులమనే అపరిపక్వ భావన కేవలం మన మనసులో పరాకాష్టకు చేరిన మూర?త్వమనే బీజం నుండి అంకురించిన కలుపు మొక్క అని, దానిని ఆదిలోనే త్రుంచి వేయాలి.

– సుంకవల్లి సత్తిరాజు.

(సోషల్‌ ఎనలిస్ట్,‌కాలమిస్ట్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *