ఎల్లమ్మ తల్లి కృపతో ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: మావురాల ఎల్లమ తల్లి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండలని రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కరోళ్ల యశోద చంద్రయ్య ముధిరాజ్ లు పురాతనమైన ఆలయాన్ని పునరుద్ధించడం సంతోషం అన్నారు.ఎల్లమ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహా కుంభాబిశేఖ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ఉత్సవాల్లో సర్పంచ్ కరోళ్ల ప్రియాంక రాజేష్, నాయకులు
మునగపాటి నవీన్, ఆనందం దోమ శ్రీనివాస్ రెడ్డి,గుండెమోని అంజయ్య ముధిరాజ్, వి యాదగిరి గౌడ్,కడమోని ప్రభాకర్, రాజు నాయక్,సురేందర్ రెడ్డి,ఎన్ సుధీర్ గౌడ్,పూజాహరి శ్యామ్ పంతులు,భక్తులు ,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page