ఎల్‌ఆర్‌ఎస్‌పై బిఆర్‌ఎస్‌ ఆందోళన

కాంగ్రెస్‌ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఉచితంగా పథకం అమలుకు డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష బిఆర్‌ఎస్‌ బుధవారం ఆందోళనకు దిగింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి.. నాడు ఇష్టారీతిగా  మాట్లాడిన నేటి కాంగ్రెస్‌ మంత్రులు, ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్‌ నేతలు..ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్య కర్తలు బుధవారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. నాడు ఇచ్చిన హావిూ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని నినదిం చారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం అవిూర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద గులాబీ పార్టీ ధర్నాకు దిగింది. ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు.

ఈ ధర్నాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే వివేకనంద గౌడ్‌ , సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, నగర నేతలు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసే వరకు వదిలి పెట్టేదిలేదన్నారు. 25 లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు. పేదలపై రూ.20 వేల కోట్లు ఆర్థిక భారం పడుతుందన్నారు. పేదలను దోచుకునేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేసే వరకు కాంగ్రెస్‌ను వదిలి పెట్టే ప్రసక్తే లేదని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. మరోవైపు ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ ముందు సిటీ ఎమ్మెల్యేల ఆందోళనకు దిగారు. ఎలాంటి ఫీజు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు పట్టుకొని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు. ఇకపోతే జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఆందోళనలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *