తెలంగాణ నినాదం
రక్తంలో పుట్టింనెత్రు
ఏరులై పారింది
కత్తుల వంతెన మీద
నడిచింది కలగనటమంటే
రాజ్యంకు శుత్రువుగా మారటమే
కోస్తాంధ్ర పెట్టుబడిదారి
పాలనలో ప్రజాస్వామ్యం
ముక్కలైంది.
ఆట పాట మాట బంద్
నిప్పుల కొలిమిలో నడిచిన
మనుషులు రాష్ట్రాన్ని
స్వస్నించారు .
ప్రజల హక్కుల కోసమే
ప్రజాస్వామ్య ప్రత్యేక
తెలంగాణలోపాలకుల
పాశవిక పాలనలో పౌరుని
గొంతు మూగబోయింది…!
ఆ గొంతు పెకలటానికి
ప్రజాస్యామ్య నినాదం
రాజయ్యవల్సిందే ..!!
గొంతు చిన్నదే కాని
అది అశేష ప్రజల తరపున
నిలబడి మాట్లాడుతున్నదనే
ఎరుక మరిచిపోకూడుదు
విశాలాంధ్రలో ప్రజారాజ్యం
ఎట్లా కలగా మిగిలిందో ?
భౌగోళిక తెలంగాణలో న్యాయం
ప్రజాస్వామ్యం కల్లగా మారుతుంది !
మనఆట. మనపాట.మనమాట
మనరాత.ప్రజాస్వామ్య కని
ప్రతిబింబిచేదిగా ఉండాలి
సభ పెట్టుకునే హక్కు
మాట్లాడే హక్కు
చదువుకునే హక్కు
ఉపాధిని పొందే హక్కు
స్త్రీలు. దళితులు. ముస్లింలు
ఆదివాసి లపై దాడులు
లేని పాలన కోసం
50 వసంతాలుగా
ఈ నేల పై నెత్తురు చిందుతున్నది
ఆ ప్రయాణంలో
చెట్టు గుట్టలు
దాటింది ముళ్ళను
ఏరిచేసింది. విలువైలు
ప్రాలులను అర్పించారు
(జూన్ 2న తెలంగాణ
రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా…)
-శోభరమేష్
కాకతీయ విశ్వవిద్యాలయం
8978656 327