వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 2; శాసనసభ్యుడు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కోరిక మేరకు ఇల్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు సీఎం కెసిఆర్ ప్రత్యేక కృషి చేశారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యను పరిష్కరించాలని అన్నారు రిజిస్ట్రేషన్లపై ఆంక్షలతో ఇబ్బందిపడుతున్న ఆరు నియోజకవర్గాల్లోని 44 కాలనీలకు విముక్తి కల్పించే ఉద్దేశ్యంతో ఆంక్షలను గతంలో ఎత్తివేస్తూ జీవో 118 విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.దానిలో భాగంగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 4000 మంది లబ్ధిదారులకు రెగ్యులరైజేషన్ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి,ఎమ్మెల్సీలు .ఎగ్గే మల్లేషం,బొగ్గారపు దయానంద్,మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్,మల్కాజిగిరి కలెక్టర్ అమోయ్ కుమార్,జీ.హెచ్.ఏం.సీ.కమిషనర్ రోనాల్డ్ రోస్,మరియు వివిధ శాఖల అధికారులు,మాజీ కార్పొరేటర్లు,మాజీ ఛైర్మన్లు,ఉద్యమకారులు,డివిజన్ల అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాళ్లు,మాజీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు,మహిళలు,కార్యకర్తలు,అభి మానులు,కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.