తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలట రోహిత్ రెడ్డికి మద్దతుగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోఎన్నికల ప్రచారాన్ని
నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కి నిరంతరం కృషి చేసే ఏకైక నాయకుడు రోహిత్ రెడ్డి అని అన్నారు. పట్టణం లోని కలికాదేవి ఆలయం నుండి నెహ్రు గంజ్ వరకు రోహిత్ రెడ్డి కి మద్దతు తెలపాలని వ్యాపారస్థులను కోరారు. బీసీ లకు అండగా ఉంటూ బీసీ సమికృత భవనం కోసం 2 కోట్ల నిధులను అందించిన ఏకైక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అని అన్నారు. ఈ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి ని భారీ మెజారిటీ తో గెలిపించి తాండూరు అభివృద్ధి కిసహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర బీసీ సభ్యులు సయ్యద్ షుకూర్, మహిళ అధ్యక్షురాలు జ్యోతి, బీసీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.