అమరావతి, మే 5 : ఎపిలోనూ ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరు ఎపి ఇంటర్ బోర్డు పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే టెన్త్ పరీక్షలు కొనసాగు తున్నాయి. మే 6 నుంచి 24 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహుం 12 గంటల వరకుపరీక్షలు జరగనున్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ నెల 24వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 5,19,319 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,89,539 మంది మొత్తం 10,01858 మంది హాజరు కానున్నారని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనరు ఎంవి శేషగిరిరావు వివరించారు. మొత్తం 1,456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 736 పోలీస్ స్టేషన్లను స్టోరేజ్ పాయింట్లుగా గుర్తించి ప్రశ్రాపత్రాలను భద్రపరచనున్నామని తెలిపారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సిసి కెమెరాలు, స్కానర్లు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని, ఇందుకు సంబంధించిన సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నా మని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ’టెన్త్’ పరీక్షల్లో చిన్నచిన్న సంఘటనలు తప్ప పకడ్బందీగా నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. సంఘటనలకు సంబంధించి 60 మందిని అరెస్టు చేశామని చెప్పారు.