ఉన్నత విలువలు గల నేత మంత్రి సబితమ్మ

 

ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్

– నిరంతరం అభివృద్ది కోసం పరితపించే నాయకురాలు

-అభివృద్ధిని చూసి వోటు వేయండి

 

మహేశ్వరం, ప్రజాతంత్ర, నవంబర్ 23: నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే ఉన్నత విలువలు గల మంచి నాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డికి వోటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గాని వేల కోట్ల రూపాయలతో అభివృద్ది చేసినట్లు చెప్పారు. గత మూడు, నాలుగు ఏళ్ల క్రితం భారీ వర్షాలు వచ్చి, ప్రధానంగా మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో విపరీతంగా వరద వొచ్చి, పలు ప్రాంతాలు జలమయం అయ్యాయన్నారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి పట్టు బట్టి వందల కోట్లు తీసుకువచ్చి, ఈ ప్రాంతానికి వరద ముప్పు సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తిగా నగర శివారు ప్రాంతాల్లో వరద ముప్పు నివారణకు రూ.1000 కోట్లు కేటాయించి, వరద కాలువల నిర్మాణ చేపట్టినట్లు చెప్పారు. అదే విధంగా రూ.1200 వందల కోట్లతో మంచి నీటి సమస్య లేకుండా చేసినట్లు తెలిపారు. విద్య మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాల్ టెక్నిక్, లా కళాశాలతో పాటు 450 పడకల ప్రభుత్వ మెడికల్ కళాశాలను తెచ్చి పెట్టినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రిగా సబితా రెడ్డి పట్టు వట్టి వేల కోట్ల నిధులు తెచ్చి,  నియోజకవర్గాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి సబితమ్మ కృషితో దాదాపు 52 కొత్త పరిశ్రమలతో పాటు ఫాక్స్ ఖాన్ కంపెనీ వచ్చాయన్నారు. వీటితో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇవే కాకుండా ఈ ప్రాంతానికి ఐటి కంపెనీలు రానున్నాయని, దీంతో ఈ ప్రాంతం రూపు రేఖలు పూర్తిగా మారుతాయని అన్నారు.  నిరంతరం ప్రజల మధ్య ఉంటూ.. నిత్యం అభివృద్ది, సంక్షేమం కోసం పరితపించే గొప్ప నాయకురాలు అయిన సబితా ఇంద్రారెడ్డికి, మహేశ్వరం నియోజకవర్గం మరింత అభివృద్ది చెందాలంటే కారు గుర్తుకు వోటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ చెప్పే అబద్ధాలను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. మూడు గంటలు కరెంట్ ఇచ్చేవాళ్ళు కావాలో, 24 గంటలు కరెంట్ ఇచ్చే పార్టీ కావాలో ఆలోచించాలన్నారు. కష్టపడి తెచ్చుకున్న రాష్టంను కొందరు అగం చేయాలని చూస్తున్నారని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్నారు. రూ.10 వేలు ఉన్న రైతు బంధును రూ.16 వేలకు పెంచినట్లు చెప్పారు. రైతు బంధు పథకానీ తెచిందే బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రైతు బీమా పథకం మాదిరిగా రాష్టంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించనున్నట్లు తెలిపారు. మైనార్టీల అభ్యున్నతికి గత ప్రభుత్వాలు కేవలం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే, బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నర్రా ఏళ్లలో మైనార్టీల అభ్యున్నతికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తాడాని, నా గొంతులో ప్రాణం ఉన్నతవరకు మతతత్వ వాదులకు స్థానం ఉండదని హెచ్చరించారు. భూదేవంత ఓపిక, దర్పం లేకుండా సాధారణ ప్రజలతో మమేకం అయి నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించే సబితా ఇంద్రారెడ్డికి వోటు వేసి గెలిపించాలని కోరారు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలను చుస్తేనే సబితా ఇంద్రారెడ్డి విజయం ఖాయం ఐపోయిందంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి లాంటి వ్యక్తి దొరకటం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ఎయిర్ పోర్టు వరకు విస్తరిస్తున్న మెట్రోను సైతం తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు రూ.6600 కోట్లతో విస్తరించాలని సబితా ఇంద్రారెడ్డి కోరిక మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.3 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సబితా ఇంద్రారెడ్డిని మళ్ళీ గెలిపించి, అభివృద్ధి కొనసాగించుకోవాలని సీఎం సూచించారు. మహేశ్వరం నియోజకవర్గము లాంటి ఔటర్ రింగ్ రోడ్డు లోపలి పట్టణ ప్రాంతాల్లో రూ.670 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు విడుదల చేశామన్నారు.. అంతకు ముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అడగగానే నియోజకవర్గం అభివృద్ధికి వేల కోట్లు ఇచ్చి ప్రోతహించిన సీఎం కేసీఆర్ కు ఇక్కడి ప్రజలు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి మరొక సారి కారు గుర్తుకు వోటు వేసి గెలిపించాలని సబితా ఇంద్రారెడ్డి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జెడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page