బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : కేంద్రం నిధులను దారిమళ్లిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అలాగే తెలంగాణలో ఉచిత విద్యుత్ పేరిట స్కామ్ జరుగుతుందన్నారు. డిస్కంలను నష్టాల్లోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. కవి•షన్ల కోసం కేసీఆర్ కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు.
రూ.3 యూనిట్ విద్యుత్‌ను రూ.6కు కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ అబద్దాలతో కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు. అడ్డగోలు అప్పులతో రాష్ట్రం దివాళా తీసిందన్నారు.