- సంతోషంగా ఉన్నాం..
గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు
గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత పూర్తిగా తనదే
బిజెపికి బిఆర్ఎస్ పూర్తిగా అమ్ముడుపోయింది
ఉమ్మడి ఎపి సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: మీడియా సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 5: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది పచ్చడి లాంటిదని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్మలెంట్ ఎన్నికల్లో తమ ద విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్నిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు వొచ్చాయని చెప్పారు. కాంగ్రెస్‌ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖర్గే, సోనియా దిశానిర్ధేశంతో మంచి ఫలితాలు సాధించా మని స్పష్టం చేశారు. వంద రోజుల పాలను ప్రజలు ఆదరించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మా ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పాలనను మెచ్చుకుని ప్రజలు వోటేశారని వెల్లడిరచారు సీఎం రేవంత్ రెడ్డి. 2019లో మూడు ఎంపీ సీట్లు ఇస్తే 2024లో ఆ సంఖ్య 8కి పెరిగిందని చెప్పారు. బీజేపీ గెలిచిన 8 సీట్లలో బీఆర్ఎస్ 7 చోట్లలో డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించారన్నారు. జేపీని గెలిపించడానికి కేసీఆర్ బలహినమైన అభ్యర్థులను పెట్టారంటూ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి డియాతో మాట్లాడారు. సిద్దిపేటలో హరీష్ రావు బీఆర్ఎస్ వోట్లను బీజేపీకి మళ్లించారన్నారు. కేసీఆర్, హరీష్ కలిసి మెదక్ లో బీజేపీని గెలిపించారని తెలిపారు.
వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేశారని తెలిపారు. 37 శాతం వోట్లున్న బీఆర్ఎస్కు 16 శాతానికి చేరిందన్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులును రాహుల్ గాంధీ ఏకం చేశారని చెప్పారు సీఎం రేవంత్. మోదీ వ్యతిరేక విధానాలను రాహుల్ ప్రజలకు వివరించారు. అలాగే తెలంగాణలో వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నచ్చితే వోటు వేయాలని లోక్‌సభ ఎన్నికల్లో కోరామని.. 8 మంది తమ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. వందరోజుల పాలన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 41 శాతం వోట్లు వొచ్చాయన్నారు. అసెంబ్లీ వోట్ల శాతం కంటే ఎక్కువగా లోక్‌సభ ఎన్నికల్లో వచ్చాయి. కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మేం భావిస్తున్నాం. 8 మంది ఎంపీలను గెలిపించి ఆశీర్వదించారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు. 2019 ఎన్నికల్లో మాకు 3 సీట్లు వొస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరింది. బీఆర్ఎస్ ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆ 7 సీట్లలో బీజేపీని గెలిపించి అవయవదానం చేశారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారు. మెదక్‌లో కాషాయ పార్టీ విజయానికి హరీశ్‌రావు సహకారం అందించారని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇదిలావుంటే ప్రజల తీర్పును గౌరవించి ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదన్నారు. ఎన్‌డిఎ మిత్రపక్షాలు మోదీని రాజీనామా కోరాలన్నారు. మోదీ హుందాగా రాజీనామా చేసి ప్రధానిగా తప్పుకుంటే బాగుంటుదని తెలిపారు. రాజకీయ విలువలు చెప్పడానికే మోదీ కానీ వాటిని పాటించరని విమర్శించారు. రాముడి పేరుతో వోట్లు అడిగితే దేవుడే గుణపాఠం చెప్పాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డి, ఇండియా కూటమికి సమానంగా ఫలితాలు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి . మోదీ గ్యారెంటీ పేరుతో వెళ్తే జనం తిప్పికొట్టారని చెప్పారు. మోదీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు చెప్పారన్నారు. ఎన్నికల ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివని చెప్పారు. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తామని అన్నారు. గెలుపు, ఓటమి అన్నీటికీ పీసీసీ చీఫ్ గా, సీఎంగా తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తమకు ఎవరితో ఎలాంటి భేషాజాలు చెప్పిన సీఎం రేవంత్… రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడుతామన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎపిలో చంద్రబాబు ప్రమాణానికి ఆహ్వానిస్తే వెళతామన్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాజధాని అని, మిగతా సమస్యలప ఇకముందు కలిసి చర్చించుకుంటామని అన్నారు. డియా సమావేశంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్., కడియం శ్రీహరి, మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించిన టీపీసీసీ కార్యవర్గం

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా , ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8స్థానాలు గెలుచుకుందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీ, ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
సిఎం రేవంత్‌తో విజేతల భేటీ
అభినందనలు తెలిపిన పలువురు ఎంపిలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్5:తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎంపిలు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన్ను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంను కలిసి సన్మానించారు. వారితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వారిని రేవంత్ అభినందించారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో తన సప ప్రత్యర్థి బూర నర్యయ్య గౌడ్‌పై 2,22,170 వోట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు, సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ నుంచి 2,20,339 వోట్ల మెజార్టీతో విజయం సాధించారు. అటు, చామల కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసారు. తన గెలుపునకు సహకారం అందించినందుకు ఈ సందర్భంగా మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రిని సత్కరించారు. ఇరువురు నేతలు ఎన్నికల ప్రచారం, ఓటింగ్, ఎక్కెడెక్కడ ఎంత మెజార్టీ వచ్చిందోననే అంశాలపై చర్చించుకున్నారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. మజ్లిస్ పార్టీ తన హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. 2, 3 చోట్ల తప్ప అన్ని స్థానాల్లోనూ మూడో స్థానంలో ఉంది. అటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు అదనం. మంగళవారం ఫలితాల చివరి వరకూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్‌గా సాగింది.