ఉక్కపోత నుంచి నరగ వాసులకు ఊరట

ఈదురుగాలులతో పలుచోట్ల వర్షం
ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 21 : ఉక్కపోతతో ఉడికిపోతున్న నగరవాసులకు వరుణుడు ఒక్కసారిగా ఊరటనిచ్చాడు. గురువారం నగరంలోని పలుప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. బలమైన ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమయ్యాయి. శంషాబాద్‌లో కురిసిన భారీవర్షం విమానాల రాకపోకలపై ప్రభావం చూపింది. విమానాశ్రయానికి వొచ్చే 4 విమానాలకు వెనక్కి పంపారు.
నగరంలోని పలుప్రాంతాల్లో ఈదురుగాలులలో కూడిన వాన రావడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కూకట్‌పల్లి, మేడ్చల్‌, ‌బాలానగర్‌, ఎం‌జె మార్కెట్‌, అబిడ్స్, ‌బషీర్‌ ‌బాగ్‌, ‌నాంపల్లి, బేగం బజార్‌ ‌పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీగా ఈదురుగాలులు వీయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలోని మలక్‌పేట్‌ ‌ప్రాంతంలో భారీవృక్షం నేలమట్టమైంది. బలమైన ఈదురుగాలులకు తీగలగూడలో చెట్టు కూలిపోవడంతో ద్విచక్రవాహనం ధ్వంసమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *