ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 16 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి బిఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు మద్దతుగా నిర్వహించే ఎన్నికల బహిరంగ సభకు ఈనెల 19న కల్వకుర్తి పట్టణానికి బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నట్లు బిఆర్ఎస్ కల్వకుర్తి అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ బహిరంగ సభను పాలమూరు వెళ్లే రోడ్డు మార్గంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపంలో భారీ బహిరంగ సభకు నిర్వహించే ఏర్పాట్లను జైపాల్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఆయన వెంట కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మాసత్యం పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.