ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం, మంచాల,యాచారం,మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు ఇబ్రహీంపట్నం మున్సి పాలిటి,ఆదిభట్ల మునిసిపాలిటీ,తదితర గ్రామాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.గ్రామాలలో యువకులు,ప్రజలు వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని వాటికి సంబంధించిన అనుమతులను తీసుకొని వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణనాధునికి ప్రత్యేక పూజలు అందించారు. వాడ వాడల వినాయక చవితి దే దీప మాన్యంగా వెలుగొంది,ఆయా మండలాల్లో ఉన్న గ్రామాలలో ఆయా పార్టీలకు చెందిన బడా నాయకులు,చోటా నాయకులు గ్రామాల మండపాలకు వరుసగట్టి వచ్చి యువకులను ప్రోత్సహించి వినాయక మండపాలకు చేరి పార్వతీతనాయునికి ప్రత్యేక పూజలు చేశారు.గ్రామాల్లో చాలా మేరకు చిన్నచిన్న గణనాధులను ఇండ్లలో ఏర్పాటు చేసుకొని మహిళలు ప్రత్యేక పూజలు గావించారు.వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను సుఖ సంతోషాలతో జరుపుకొని ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు చేసుకోవాలని పోలీసులు,పలు పార్టీలకు చెందిన నాయకులు యువతకు సూచనలు ఇస్తున్నారు.మండపాల వద్ద డీజేలు పెట్టుకోవద్దని ఇదివరకే పోలీసులు యువతకు ఆయా పార్టీల నాయకులకు సూచించారు.భక్తిశ్రద్ధలతో మండపాల వద్ద భజనలతోపాటు కోలాటలు,బతుకమ్మలు ఆటపాటలతో వినాయకుని సంతోషపరిచే విధంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అనుకూలంగా భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని ఆయా గ్రామాల్లోని పెద్దలు యువకులకు సూచించారు.