Take a fresh look at your lifestyle.

ఇద్దరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు మద్రాస్‌ ‌హైకోర్టుకు బదిలీ

న్యూ దిల్లీ, మార్చి 23 : తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌ ‌జారీ చేసింది. ఏపీ హైకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్‌ ‌బట్టు దేవానంద్‌, ‌తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌దేవరాజు నాగార్జునను మద్రాస్‌ ‌హైకోర్టుకు బదిలీ చేసింది.

అలాగే మద్రాస్‌ ‌హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జ్యుడీయల్‌ అధికారి పీ వడమాలైని నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ ‌రిజిజు ట్వీట్‌ ‌చేశారు. గత ఏడాది నవంబర్‌లో ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది

Leave a Reply