హైదరాబాద్, పిఐబి, మార్చి 29 : భారత్‌కు 2022 సెప్టెంబర్ 17న తీసుకు వొచ్చిన చీతాలలో ఒక చీతాకు నాలుగు పిల్ల చీతాలు పుట్టినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవులు మరియు జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్వీట్‌ను ప్రధాన మంత్రి షేర్ చేస్తూ – ‘‘అపురూపమైనటువంటి కబురు!’’ అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.