భూములను అప్పనంగా కాజేస్తున్నారు
మండిపడ్డ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 24 : సీఎం కేసీఆర్ అరాచకాలను, అక్రమాలను ఇంకెంతకాలం సహిద్దామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దపు దగా సందర్భంగా కాంగ్రెస్ నిరసలను చేపడితే ఎందుకు అరెస్టులు చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం అంతా మంచే చేస్తే ఎందుకు అడ్డుకోవాలన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హావి•ల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, గిరిజనులకు పోడు భూములపై హక్కు కల్పించలేదని విమర్శించారు. వేల కోట్ల ప్రైవేట్ దోపిడి, వందల కోట్ల పార్టీ ఆస్తులు ఉన్నా.. కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 33 జిల్లాల్లో వందల కోట్ల విలువ చేసే ప్రజల భూమిని దోచి పెట్టారని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ బరితెంగింపును ఇట్లానే వదిలేద్దామా అని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాలకు కోట్లు విలువ చేసే భూమిని తక్కువ ధరకు కేటాయించారని విమర్శించారు. ఇకపోతే దళితబంధు పేరుతో దగా చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్క దారి పట్టాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి దళిత, గిరిజనుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు. గత ప్రభుత్వాలు దళిత గిరిజనుల అభివృద్ధి పథకాలపై స్వయంగా ముఖ్యమంత్రులే 3, 6 నెలలకు ఒకసారి సవి•క్షలు నిర్వహించే వారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాకాలం తరవాత దళితుల సంక్షేమం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.




