ఆ విద్యాపిఠానికి నూరేళ్ళు

ఆ విద్యాపిఠానికి నూరేళ్లు

ఆ విద్యాదేవి ఆలయం వెలుగనీ వేయ్యేళ్లు

నిర్మించిన సంకల్పం గొప్పదై

దర్శించిన వారంతా

విద్యా వినయ వివేకులై

చదువిచ్చి ఎగిరేస్తే గువ్వలమయ్యాo

   నీలాల నింగిలో

అనుభవమిచ్చి వదిలేస్తే చేపలమయ్యాo

    గలగల నదిలో

అతడు వజ్రమంత మెరుపు

ఆమె వనమంత వాసన

బాణాలు సంధిచడం

కిరణాలు ఎక్కుపెట్టడం అప్పుడే

మొన్నటి ఘటనలు సంఘటనలు గుర్తొస్తే

నిన్నటి గుర్తులు జ్ఞాపకాలు గుబాళిస్తే

నరనరాన పారుతుంది ఆ స్ఫూర్తి

తరతరాల వెలుగుతుంది ఆ కీర్తి

అందమై సర్వాంగ సుందరమై

మనసు పులకించే శిల్పకళావైభవమై

నిత్యహోమాలు యజ్ఞయాగాదులతో

తరించిన తపోవనంలా దివ్యక్షేత్రమై

దీర్ఘ కాల భవిష్యత్తు అందించి

ఒడ్డుకు చేర్చే ఒర్పు ప్రసాదించి

మా బతుకులకి ఒక యూగ్యతాపత్రమై

మా అతుకులకి ఒక తాళపత్రమై

  ___కోటo చంద్రశేఖర్ 9492043348

ఉస్మానియా ఊయలలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page